ఆస్తి రాయలేదని భర్తపై కత్తితో దాడి, బస్సులో అమ్మాయి పట్ల అసభ్యంగా.. సూసైడ్ యత్నం

Wife attacks on husband with knife
రాజమండ్రి/రంగారెడ్డి: ఇల్లు తన పేర రాయలేదని ఓ భార్య తన భర్త పైన కత్తితో దాడి చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలో జరిగింది. కథనం ప్రకారం.. వెల్దుర్తి గ్రామానికి చెందిన లాజరు, నూకాలమ్మలు భార్యభర్తలు. వీరికి కొంతకాలంగా ఆస్తి తగాదాల కారణంగా తరుచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ విషయమై పెద్దల సమక్షంలో అనేకసార్లు సయోధ్య కురిదింది. గత మూడు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. భర్త కూలీ పనికి వెళ్లడం లేదని, ఉంటున్న ఇల్లు తన పేరున రాయాలని భార్య వాదిస్తోంది. ఈ నేపథ్యంలో భర్త గ్రామంలో నివాసముంటున్న తన తనయుడి ఇంటికి వెళ్లిపోయాడు.

బుధవారం లాజరు చాయ్ తాగేందుకు దుకాణం వద్దకు వెళ్తున్న సమయంలో నూకాలమ్మ కత్తితో అతడి పైన దాడి చేసింది. భర్త చేతికి గాయమైంది. ఆయనను పిఠాపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు బాలికల అదృశ్యం

రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఘనపూర్ లో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. ఓ అనాథాశ్రమంలో ఉంటున్న బాలికలు అదృశ్యమయినట్టు ఆశ్రమ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

అధ్యాపకుడి లైంగిక వేధింపులతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఖమ్మం జిల్లా మణుగూరులో బుధవారం ఉదయం విద్యార్థిని తల్లిదండ్రులు అధ్యాపకుణ్ని నిలదీసేందుకు కళాశాలకు రావడంతో విషయం బయటకు తెలిసింది.

మణుగూరులోని గ్రేస్ మిషన్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని అదే కళాశాలలో అధ్యాపకుడుగా పని చేస్తున్న రాజారావు లైంగికంగా వేధించేవాడు. మనస్తాపానికి గురైన ఆ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థిని అశ్వాపురంలోని తన ఇంటికి బస్సులో బయలుదేరింది. అదే బస్సులో అధ్యాపకుడు వెళ్లాడు. బస్సులో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె చేయిపై ముద్దుపెట్టుకోవటంతో ఆమె మనస్తాపం చెందిందని తెలుస్తోంది. ఇది ఎవరికీ చెప్పుకోలేక పురుగుల మందు తాగింది. వాంతులు చేసుకోవడంతో గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సదరు విద్యార్థిని ఆరోగ్యం నిలకడగానే ఉంది.

సూసైడ్ నోట్

ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత కుటుంబ సభ్యులు ఇంట్లో వెతగ్గా, బాలిక రాసిన లేఖ దొరికింది. అధ్యాపకుడి లైంగిక వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నానని లేఖలో పేర్కొంది. దీనిపై విద్యార్థిని తలిదండ్రులు బుధవారం ఉదయం కళాశాలవద్దకు వచ్చి యాజమాన్యాన్ని నిలదీయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే నిందితుడు పరారయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+