భర్త బర్త్ డే విషెస్ చెప్పలేదని భార్య ఆత్మహత్య.. కానీ భర్త కూడా !
చిన్న కుటుంబం... చింతలేని కుటుంబం అంటూ హ్యాపీగా బతికే ఓ జంట ఇప్పుడు తీరని విషాదంలో మునిగిపోయింది. భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ, వారి ఇద్దరు పిల్లలు ఎంతో ఆనందంగా గడుపుతున్న తరుణంలో, వారి జీవితం అనుకోని మలుపు తిరిగింది. క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ ఇద్దరు బిడ్డలను మార్చే దుస్థితికి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...
అసలు ఏం జరిగింది అంటే..?
ఏపీలోని ఏలూరు నగరంలోని శ్రీవల్లి అపార్ట్‌మెంట్‌లో భార్యాభర్తలు దేవిక, సురేంద్ర నివసిస్తున్నారు. దేవిక ఉంగుటూరు మండలం నల్లమడు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. భర్త సురేంద్ర అదే మండలంలోని రాచూరు గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో హెడ్‌మాస్టర్‌గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్త పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని భార్య చిన్ని దేవీక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఉరి వేసుకున్న భార్యను చూసి తట్టుకోలేక బ్లేడ్ తో చేతులు, కాళ్ళపై నరాలు కట్ చేసుకుని భర్త సురేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత రక్తంతో నేలపై "ఐలవ్యూ దేవికా" అంటూ రాశాడు. ప్రస్తుతం అతను ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్షణికావేశంలో భార్యాభర్తలు తీసుకున్న నిర్ణయాల వలన ఇప్పుడు ఆ చిన్నారుల పరిస్థితి ఏం అవుతోందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
దేవిక మృతిపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతికి సంబంధించి పూర్తి విషయాలు తేలాల్సి ఉందని రూరల్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి ఘటనలు మానసిక ఆరోగ్యానికి సంబంధించి సమాజం ఎంతో బలహీనంగా మారిందన్న సూచనగా పరిగణిస్తున్నారు. ఆవేశంతో తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం ఎంతోమంది జీవితాల్ని నాశనం చేస్తోందని వాపోతున్నారు. ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
-
"ఏపీ లాసెట్" దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్..అప్లై చేసుకున్నారా ?? -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications