సహచరుడితో కానిస్టేబుల్ భార్య వివాహేతర సంబంథ ,భరించలేక భర్త ఆత్మహాత్యయత్నం
ఏలూరు: తనతో కలిసి పనిచేస్తున్న సహాచరుడితోనే తన భార్య వివాహేతర సంబందం కొనసాగిస్తున్న విషయాన్ని తెలుసుకొన్న కానిస్టేబుల్ భరించలేక ఆత్మహాత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
పశ్చిమగోదావరి జిల్లా ఆర్మ్ డ్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ బార్య మరో కానిస్టేబుల్ తో వివాహేతర సంబందం కొనసాగిస్తోంది. ఈ విషయం ఆలస్యంగా కానిస్టేబుల్ కు తెలిసింది. భర్తకు విషయం తెలియడంతో ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. మనోవేదనకు గురైన ఆ కానిస్లేబుల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

పాలకొల్లులోని బ్రాడీపేట కు చెందిన ఓ వ్యక్తి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తున్నాడు.ఈయన భార్యతో మరో కానిస్లేబుల్ శ్రీనివాస్ వివాహేతర సంబందం పెట్టుకొన్నాడు. ఈ విషయం ఎట్టకేలకు భాదిత కానిస్టేబుల్ కు తెలిసింది. వివాహేతర సంబందం విషయం భర్తకు తెలియడంతో పిల్లలను తీసుకొని భార్య పుట్టింటికి వెళ్ళింది.
పిల్లలకు దూరం కావడం, భార్య నుండి పోన్ లేకపోవడం, తనను భార్య పిల్లలకు తోటి కానిస్టేబుల్ శ్రీనివాస్ దూరం చేశాడనే మనోవేదనకు గురైన కానిస్టేబుల్ పురుగుల మందు తాగి ఆత్మహాత్యయత్నానికి ప్రయత్నించాడు.ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications