బిడ్డలున్నా.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య
విశాఖపట్నం: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హత్య చేయించింది ఓ ఇల్లాలు. ప్రియుడు అతని స్నేహితుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ సంఘటన విశాఖపట్నంలో ఈ నెల 18వ తేదీన జరిగింది. పోలీసులు ఈ కేసు మిస్టరీని తాజాగా చేధించారు.
పోలీసుల విచారణలో ఆమెకు పెళ్లికి ముందే మరో వ్యక్తితో (ప్రియుడు) సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు. పెళ్లి తర్వాత కూడా దానిని కొనసాగించింది. హతుని పేరు నటరాజ్. ఈ హత్య కేసును ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు చేధించారు.

కొబ్బరితోటకు చెందిన నటరాజ్‌కు పార్వతితో పన్నెండేళ్ల క్రితం పెళ్లయింది. అప్పటికే ఆమెకు జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన మినరల్ వాటర్ సరఫరా చేసే మురళితో సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా ఆమె తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. భర్త దుబాయ్ వెళ్లడంతో స్వేచ్ఛ లభించింది. మురళి స్నేహితుడి ఇంట్లో తరచూ ప్రియుడితో గడిపేది.
ఆ తర్వాత భర్త దుబాయ్ నుంచి వచ్చాడు. భార్య విషయం తెలిసి మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో భార్య ప్రియుడిపై భర్త దాడి కూడా చేశాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య ప్రవర్తనతో స్థానికంగా గొడవలు రావడంతో వారు ఇల్లు మార్చారు.
ఆరు నెలల క్రితం 104 ఏరియా సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అక్కడకు వచ్చినా భార్య తీరులో మార్పు లేదు. ప్రియుడితో కలువొద్దని తరుచూ భర్త హెచ్చరించేవాడు. ఈ క్రమంలో ఆమె భర్తను అంతమొందించేందుకు ప్రియుడు మురళిని సంప్రదించి హత్యకు ప్లాన్ వేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!