వివాహేతర సంబంధం: ప్రియుడి సహయంతో భర్త హత్య, పట్టుబడ్డారిలా..

ఒంగోలు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది భార్య. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలో చోటు చేసుకొంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారు.

వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాల్లో చిచ్చు రేగుతోంది. గతంలో కూడ ఈ తరహ ఘటనలు అనేకం చోటు చేసుకొన్నాయి. అదే తరహ ఘటన మరోకటి వెలుగు చూసింది. ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు అడ్డుగా ఉన్నాడని భావించి అతడిని హత్య చేశారు.

కర్నూల్ జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట బస్టాండ్‌ సెంటర్లో శ్రీరాం శెట్టి భాస్కర్ రావు కొబ్బరి బొండాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఎన్. శ్రీనివాసు అతడికి స్నేహితుడు. భాస్కర్‌రావు పథకం ప్రకారంగా శ్రీనివాస్‌ను హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

స్నేహితుడినే హత్యకు కారణమిదే

స్నేహితుడినే హత్యకు కారణమిదే

కర్నూల్ జిల్లా సున్నిపెంట బస్టాండ్ సెంటర్లో పండ్లు, కొబ్బరిబొండాల వ్యాపారం చేసే భాస్కర్‌రావుతో శ్రీనివాస్‌ మంచి స్నేహితులు శ్రీనివాస్ మద్యానికి అలవాటు పడ్డారు. అంతేకాదు అప్పులు కూడ చేశారు. అప్పులిచ్చిన వారి నుండి ఒత్తిడి పెరగడంతో రెండేళ్ళ క్రితం ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అయితే శ్రీనివాస్ కొనసాగించే వ్యాపారాన్ని ఆయన భార్య మల్లీశ్వరీ కొనసాగిస్తోంది. అదే సమయంలో శ్రీనివాస్ స్నేహితుడు భాస్కర్‌రావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రెండు రోజుల క్రితం భాస్కర్‌రావు శ్రీనివాస్‌ను హత్య చేశారు.

ఆ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని

ఆ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని

మద్యానికి బానిసగా మారిన శ్రీనివాస్ ఊరి నుండి పారిపోయాడు. అయితే ఆసమయంలో భాస్కర్‌రావుతో శ్రీనివాస్ భార్య మల్లీశ్వరీకి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం కొనసాగిస్తున్నారు.అయితే కొద్ది రోజుల క్రితం శ్రీనివాస్ ఊరికి తిరిగి వచ్చాడు. అయితే భాస్కర్ రావు, మల్లీశ్వరీ మద్య నెలకొన్న వివాహేతర సంబంధం శ్రీనివాస్‌కు తెలుస్తుందని వారు భయపడ్డారు. అంతేకాదు భవిష్యత్తులో తమ బంధాన్ని కొనసాగించలేమని భావించారు. ఈ తరుణంలో శ్రీనివాస్‌ను హత్యచేయాలని ప్లాన్ చేశారు.

హత్యకు ఇలా ప్లాన్ చేశారు

హత్యకు ఇలా ప్లాన్ చేశారు

మార్చి 24న, భాస్కర్ రావు పక్కా ప్లాన్‌తో శ్రీనివాస్‌ను హత్యచేశాడు. తన ఆటోలో కొబ్బరి బొండాల లోడుతో వస్తూ శ్రీనివాస్‌ను కూడ తీసుకొచ్చాడు. పెద్దారవీడ మండలం హనుమాన్ జంక్షన్ వద్ద తన ఆటోలోని సరుకును వేరే ఆటోలోకి ఎక్కించాడు అక్కడి నుండి వారిద్దరూ సున్నిపెంటకు బయలుదేరారు. రాత్రి 11 గంటలకు పెద్దదోర్నాలకు చేరుకొన్నారు. కానీ, అడవిలో సున్నిపెంటకు వెళ్ళేందుకు అనుమతి లేదని శ్రీనివాస్‌కు మద్యం తాగించాడు. మత్తులో మునిగిన తర్వాత భాస్కర్ రావు తీగలేరు వాగుకు వద్దకు శ్రీనివాస్ ను తీసుకెళ్ళి హత్య చేశాడు. పెట్రోల్ పోసి మృతదేహన్ని దగ్దం చేశాడు.

గుంటూరుకు వెళ్తుండగా అరెస్ట్

గుంటూరుకు వెళ్తుండగా అరెస్ట్

శ్రీనివాస్‌ను హత్య చేసిన తర్వాత భాస్కర్ రావు, మల్లీశ్వరీలు జాగ్రత్తపడ్డారు.పత్రికల్లో వచ్చిన ఫోటో ఆధారంగా మృతదేహన్ని శ్రీనివాస్ కుటుంబసభ్యులు గుర్తించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ కేసు విచారణ జరిపిన పోలీసులకు భాస్కర్‌రావు, మల్లీశ్వరీ కదలికలపై అనుమానం వచ్చింది. దీంతో వారిద్దరిపై నిఘా వేశారు. ఈ తరుణంలో శనివారం నాడు వారిద్దరూ గుంటూరుకు పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో అసలు విషయాన్ని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+