భర్తను చంపిన వ్యక్తిని తానే చంపి ప్రతీకారం తీర్చుకొన్న భార్య

Posted By:
Subscribe to Oneindia Telugu

సత్తెనపల్లి:తన భర్తను చంపిన వారిని హత్య చేసి ఓ భార్య ప్రతీకారం తీర్చుకొంది.రెండేళ్ళ తర్వాత గ్రామానికి వచ్చిన శత్రువును కనిపెట్టి మరీ హత్య చేసి తన ప్రతీకారాన్ని తీర్చుకొంది ఓ భార్య, ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గోరంట్లకు చెందిన దొంగల సాంబశివరావు భార్య చంద్రకళ పట్ల గ్రామానికి చెందిన కల్లు వెంకట్రావు అసభ్యకరంగా ప్రవర్తించాడు.

అయితే ఈ ఘటనపై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు.చంద్రకళకు క్షమాపణ చెప్పాలని వెంకట్రావును పెద్దలు ఆదేశించారు. అయితే వెంకట్రావు మాత్రం దీనికి అంగీకరించలేదు.వెంకట్రావుకు ఆయన మేనమామ టి. ధరణి నాగేశ్వర్ రావు కూడ సమర్థించారు.

wife revenge for husband murder in guntur district

అయితే ఈ విషయాన్ని మనసులో పెట్టుకొన్న సాంబశివరాలు అతని సోదరులు రామారావు, సుబ్బారావులు 2014 డిసెంబర్ 12న, ధరణి నాగేశ్వర్ రావును కత్తులతో నరికి చంపారు.

నాగేశ్వర్ రావును హత్య చేసిన కేసులో సాంబశివరావు, ఆయన ఇద్దరు సోదరులు జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఇటీవల విడుదలయ్యారు. పిడుగురాళ్ళ సమీపంలోని పాత గణేశునిపాడులో సాంబశివరావు, తాడికొండ మండలం రావెలలో సుబ్బారావు నివాసం ఉంటున్నాడు.

ఈ హత్య జరిగిన తర్వాత వీరు జైలుకు వెళ్లడంతో తమ ఇళ్ళను, పొలాలను అద్దెకు ఇచ్చి ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 7వ, తేదిన గోరంట్ గ్రామానికి సుబ్బారావు, రామారావు వచ్చారు.

ఈ విషయాన్ని గమనించిన ధరణి నాగేశ్వర్ రావు భార్య వెంకటరత్నం తన బంధువులకు సమాచారాన్ని చేరవేసింది.మోటార్ బైక్ లపై 14 మంది కత్తులు, గొడ్డళ్ళతో దాడి చేశారు.

ఈ దాడి లో సుబ్బారావు సోదరుడు రామారావు తప్పించుకొన్నాడు. సుబ్బారావును వెంకటరత్నం నరికి చంపింది.అయితే మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో 9మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
wife revenge for husband murder in guntrur district.Nageshwar rao murdered in 2014 dec 12. pocice arrested three members in this connection. recently three members enter into the village of gorantla, nageshwar rao and others murdered subbarao , another person escaped.
Please Wait while comments are loading...