హైద్రాబాద్‌లో ప్రియుడితో కలిసి భర్తపై భార్య దాడి, వృషణాలు కోశారు!

హైదరాబాద్/కర్నూలు: వివాహేతర సంబంధానికి భర్త అడ్డు రావడం చూసి ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్త పైన దాడి చేసింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు జిల్లాకు చెందిన లింగన్న, జయమ్మ భార్యాభర్తలు. పదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు.

లింగన్న వాచ్‌మెన్. జయమ్మ దినసరి కూలి. కొద్ది నెలల క్రితం భార్యభర్తల మధ్య గొడవ రావడంతో లింగన్న సొంతూరుకు వెళ్లాడు. నాచారానికి చెందిన సుధాకర్‌తో జయమ్మకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. సుధాకర్, జయమ్మలు తాము భార్యాభర్తలమని చెప్పి ఓ ప్రాంతంలో నివసిస్తున్నారు.

 Wife tries to kill husband with the help of lover

లింగన్న కర్నూలు నుంచి రెండురోజుల క్రితం వచ్చాడు. భర్తను అడ్డు తొలగించుకోవాలని జయమ్మ తన ప్రియుడితో కలిసి పథకం పన్నింది. శనివారం అర్ధరాత్రి సుధాకర్ ఇంటికి వచ్చి తన వెంట తెచ్చుకున్న కటింగ్ ప్లేయర్‌తో నిద్రలో ఉన్న లింగన్న తలపై కొట్టి, వృషణాలు కోశారు.

జయమ్మ భర్త మెడకు తాడు చుట్టి ఉరి బిగించేందుకు యత్నించింది. లింగన్న కేకలు వేశాడు. అతను కేక వేయడంతో పక్కింటి వారు వచ్చారు. లింగన్న గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. జయమ్మను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+