కేంద్రంతో దోస్తీకి కేసీఆర్: దత్తన్నతో నవ్వులు (పిక్చర్స్)

హైదరాబాద్: కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం జలవిహార్‌లో పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఇబ్బందులుంటాయని, పక్క రాష్ట్రంతో ఇబ్బందులున్నాయని, ఈ స్థితిలో దూతగా వ్యవహరించడానికి దత్తాత్రేయకు కేంద్ర మంత్రి పదవి ఉపయోగపడుతుందని కేసీఆర్ అన్నారు.

కేంద్రంలో తెలంగాణ గొంతు లేదనే లోటు దత్తాత్రేయ వల్ల తీరిందన్నారు. తన దృష్టిలో బండారు దత్తాత్రేయ బంగారు దత్తాత్రేయ అని ఆయన అన్నారు. దత్తాత్రేయను సన్మానించడమంటే తెలంగాణను గౌరవించుకోవడమేనని ఆయన అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దత్తాత్రేయ సహాయాన్ని కోరుకుంటోందని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి కేంద్ర మంత్రిగా దత్తాత్రేయ పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా తెలంగాణ కోసం దత్తాత్రేయ అందరినీ ఏకం చేశారని, ఆ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నానని కెసిఆర్ అన్నారు. దత్తాత్రేయ మృదుస్వభావి అని, సౌమ్యుల అని ఆయన ప్రశంసించారు.

దత్తాత్రేయ మాట్లాడుతూ.. తనది రాజకీయ కుటుంబం కాదని, తాను రాజకీయాల్లోకి రావడానికి రామారావే కారణమన్నారు. హైదరాబాదులోని సనత్‌నగర్‌లో కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తెలంగాణకు తొలి కానుకగా అందిస్తానని ఆయన చెప్పారు. కెసిఆర్‌ది ఉదార స్వభావమని, కెసిఆర్ తనకు సన్మానం చేయడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. కేంద్రానికి, తెలంగాణ రాష్ట్రానికి అనుసంధానకర్తలా ఉంటానని దత్తాత్రేయ అన్నారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

ఇన్ని రోజులు కేంద్రంలో తెలంగాణ మనిషి లేడన్న వెలితి ఉండేదని, ఇప్పుడది తీరిపోయిందని, నాలుగు కోట్ల మంది ప్రజల తరఫున కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండారు దత్తాత్రేయను సన్మానించడమంటే, తెలంగాణ సమాజం తనకు తాను సన్మానించుకోవడమేనని, ఆయన బండారు దత్తాత్రేయ కాదు.. బంగారు దత్తాత్రేయఅని కేసీఆర్ కొనియాడారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

మలి విడతలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండారు దత్తాత్రేయకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం జలవిహార్‌లో పౌరసన్మానం చేసింది.

 పౌర సన్మానం

పౌర సన్మానం

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో దత్తాత్రేయ కీలక పాత్ర పోషించారని అన్నారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

అలయ్‌.. బలయ్‌ పేరుతో అన్ని పార్టీలను ఒక తాటి పైకి తీసుకువచ్చి జై తెలంగాణ అనిపించారని కే చంద్రశేఖర రావు గుర్తు చేశారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

భవిష్యత్తులోనూ ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని దత్తాత్రేయను కోరారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, వీటి పరిష్కారానికి రాష్ట్ర ప్రజల దూతగా ఢిల్లీలో కృషి చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రభుత్వం తనను సన్మానించడమంటే తెలంగాణ ప్రజలను సన్మానించడమేనని అన్నారు. ఈ సందరాన్ని తాను మరిచిపోలేనని, రాష్ట్ర ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్నీ వమ్ము చేయనని హామీ ఇచ్చారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

తెలంగాణ రాష్ట్ర్ట్రంలో సమస్యగా మారిన ఉద్యోగులు, విద్యుత్‌ అంశాలపై సీఎం కేసీఆర్‌ కొంత చొరవ తీసుకుంటే.. నేను ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడుతానన్నారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

ఇద్దరితో సమావేశం ఏర్పాటు చేస్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తా అన్నారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఈ సందర్భంగా చెప్పారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన, చెరువులు, కుంటల అభివృద్ధి పనులు రాష్ట్రాభిభివృద్ధికి ఎంతో దోహదపడుతాయని బండారు దత్తాత్రేయ అన్నారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

రాష్ట్రాభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం తన ఇంటి తలుపులు 24 గంటలూ తెరిచే ఉంటాయని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

మంచితనం, ఎంతో ఉదార స్వభావం ఉన్న కేసీఆర్‌.. కొన్నిసార్లు అంతే కఠినంగా ఉంటారని, భిన్నమైన వ్యక్తిత్వం, ప్రవృత్తులు ఉన్న వారిని కూడా జేఏసీ గొడుగు కిందకు తీసుకువచ్చారన్నారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

రాష్ట్ర సాధనకు వెలకట్టలేని కృషి చేశారని, ఉద్యమ సమయంలో ఏ కీలక నిర్ణయం తీసుకున్నా నన్ను సంప్రదించేవారని దత్తాత్రేయ గుర్తు చేశారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

సనత్‌నగర్‌ నియోజకవర్గంలో రూ.435 కోట్లతో నిర్మించిన ఈఎస్‌ఐ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి అనుసంధానంగా మెడికల్‌ కాలేజీని తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

ఆరెస్సెస్‌లో ఉన్న తనను.. సిక్కిం మాజీ గవర్నర్‌ రామారావు పట్టుబట్టి రాజకీయాల్లోకి తీసుకువచ్చారని, తాను ఈ స్థానంలో ఉన్నానంటే ఆయనే కారణమని దత్తాత్రేయ గుర్తు చేశారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

అంతకుముందు శాసనసభ స్పీకర్‌ మధుసూదనా చారి మాట్లాడుతూ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను అజాత శత్రువుగా అభివర్ణించారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

శాసనసభలో కాంగ్రెస్‌ పక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం నుంచి తెలంగాణ రాషా్ట్రనికి అత్యధిక నిధులు వచ్చేలా కృషి చేయాలని కోరారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

పార్టీలు వేరైనా తెలంగాణ అభివృద్ధి విషయంలో తామందరిదీ ఒకటే బాట జానా అన్నారు. బీజేపీ పక్షనేత డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య దత్తాత్రేయ అనుసంధానకర్తగా వ్యవహరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.

 పౌర సన్మానం

పౌర సన్మానం

టీడీపీ తరఫున ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చే బాధ్యతను దత్తాత్రేయ తీసుకోవాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+