మహిళా కమిషన్ ప్లాన్ బూమరాంగ్ ? సారీ చెప్పని పవన్ -జనసేన ట్వీట్ల దాడితో ఆత్మరక్షణలోకి !

ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన వార్ ను విశాఖ ఘటన మరో లెవల్ కు తీసుకెళ్లింది. విశాఖలో మంత్రులపై జనసైనికులు దాడి చేసిన వ్యవహారంలో పోలీసులు పవన్ ను టార్గెట్ చేయడంతో ఈ వ్యవహారం కాస్తా ముదిరింది. చివరికి పవన్ చేసిన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలకు సారీ చెప్పాలంటూ మహిళాకమిషన్ మధ్యలో దూరడంతో మొత్తం సీన్ రివర్స్ అయింది. మహిళా కమిషన్ నోటీసులకు పవన్ సారీ చెప్పకపోగా.. జనసేన ట్వీట్లతో చేసిన ఎదురుదాడి కమిషన్ ను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసింది.

పవన్ వర్సెస్ మహిళా కమిషన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శించినా పట్టించుకోని మహిళా కమిషన్ .. మీరూ చేసుకోండంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించి నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. దీంతో వైసీపీ ప్రభుత్వం నియమించిన మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడమేంటని జనసైనికులు రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో పవన్ కు మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసులు ప్రశ్నార్ధకంగా మారాయి.

నోటీసులకు స్పందించని పవన్

నోటీసులకు స్పందించని పవన్

మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పాలని, వాటిని వెనక్కి తీసుకోవాలంటూ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు. అయినా పవన్ కళ్యాణ్ వాటిపై స్పందించలేదు. నోటీసులు అందినట్లు కానీ, అందనట్లు కానీ, వాటికి సమాధానం చెప్తానని, చెప్పనని కానీ పవన్ చెప్పలేదు. దీంతో పవన్ ఈ నోటీసుల్ని లైట్ తీసుకున్నట్లు తేలిపోయింది. అయితే అసలు సినిమా అప్పుడే మొదలైంది. పవన్ అయితే స్పందించలేదు కానీ జనసైనికులు మాత్రం రెచ్చిపోయారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ల వర్షం కురిపించారు.

మహిళా కమిషన్ ఎక్కడ ? ట్యాగ్ తో ట్వీట్లు


మహిళా కమిషన్ కు పవన్ ఇచ్చిన నోటీసులకు స్పందించిన జనసైనికులు ట్విట్టర్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. వేలకొద్దీ ట్వీట్లు పెట్టారు. దీనికి మహిళా కమిషన్ ఎక్కడ ట్యాగ్ జత చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలపై జరిగిన ప్రతీ ఘటనను గుర్తు చేస్తూ మహిళా కమిషన్ అప్పుడు ఎక్కడ అని ప్రశ్నించారు.
జనసైనికులే కాదు పవన్ కు సన్నిహితులైన దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు కూడా మహిళా కమిషన్ ను నిలదీశారు. దీంతో నిన్న ట్విట్టర్ లో ఓ దశలో నాలుగో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. మహిళా కమిషన్ కు జనసైనికులు వేసిన ప్రశ్నలతో వాసిరెడ్డి పద్మ ఉక్కిరిబిక్కిరయ్యారు.

మహిళా కమిషన్ నోటీసులు బూమరాంగ్ ?

దీంతో పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసుల జారీ వ్యవహారం బూమరాంగ్ అయినట్లయింది. పవన్ ను ఓ విషయంలో మహిళా కమిషన్ ప్రశ్నిస్తే జనసైనికులు వందల విషయాలు కెలికారు. అంతా మర్చిపోయిన ప్రీతి సుగాలి వంటి వ్యవహారాల్ని కూడా గుర్తుచేస్తూ సీబీఐ విచారణ ఏదీ అని జనసైనికులు వేసిన ప్రశ్నకు వైసీపీ ప్రభుత్వం సైతం ఇరుకునపడింది. దీనికి ట్విట్టర్ లో సైతం వైసీపీ సోషల్ మీడియా వర్గాలు సమాధానం చెప్పుకోలేక ఇరుకునపడ్డాయి. చివరికి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ మీ ఆఫీసుకు దగ్గర్లోనే ఉందంటూ ఏదో ముక్తాయించారు. అయినా జనసైనికుల ఎదురుదాడికి మహిళాకమిషన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. గతంలోనూ విజయవాడ ఆస్పత్రి ఘటనలో చంద్రబాబు, బోండా ఉమకు నోటీసులు పంపిన మహిళా కమిషన్ అక్కడా ఇలాగే ఇరుకునపడింది. ఇలా.. చర్యలు తీసుకునే అధికారం లేకుండా నోటీసుల జారీ ద్వారా మహిళా కమిషన్ పరువుపోగొట్టుకున్నట్లవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+