వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవితో విజయసాయి చర్చలు?: జగన్-చంద్రబాబులకు షాకిస్తారా?

కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు చిరంజీవిపై ఇటీవల ఆసక్తికర ప్రచారం సాగుతోంది.ఆయన రాజకీయాలకు గుడ్ బై చెబుతారని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు చిరంజీవిపై ఇటీవల ఆసక్తికర ప్రచారం సాగుతోంది. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెబుతారని అంటున్నారు. అంతేకాదు టిడిపి, వైసిపి నేతలు ఆయనకోసం ప్రయత్నాలు చేస్తున్నాయని అంటున్నారు.

చిరంజీవితో విజయసాయి చర్చించారా?

చిరంజీవితో విజయసాయి చర్చించారా?

తాజాగా, మరో ప్రచారం కూడా వెలుగు చూసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఇప్పటికే చిరంజీవితో చర్చలు జరిపారని తెలుస్తోందనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం జగన్ లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చాక మళ్లీ మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఆఫర్: చిరంజీవితో చర్చకు జగన్ ఓకే, జాగ్రత్తపడుతున్న చంద్రబాబు?ఆఫర్: చిరంజీవితో చర్చకు జగన్ ఓకే, జాగ్రత్తపడుతున్న చంద్రబాబు?

చిరంజీవి ఏం చేస్తారు?

చిరంజీవి ఏం చేస్తారు?

2019లోను కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదనే వాదనలు ఉన్నాయి. 2018లో చిరంజీవి రాజ్యసభ టర్మ్ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేక ప్రచారం జరుగుతున్నట్లుగా రాజకీయాలకు గుడ్ బై చెబుతారా అనేది సస్పెన్స్ అని చెప్పవచ్చు. సమీప భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు లేని కాంగ్రెస్ పార్టీలో ఉంటారా అనేది ప్రశ్నే అంటున్నారు.

చిరంజీవి ముందు ఆప్షన్స్

చిరంజీవి ముందు ఆప్షన్స్

కాంగ్రెస్ పార్టీని వీడితే చిరంజీవి ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయని అంటున్నారు. టిడిపి, వైసిపిలు ఇప్పటికే ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నందున, పదవితో సరిపెట్టుకోవచ్చునని అంటున్నారు. లేదా నాగబాబు చెబుతున్నట్లుగా తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు అండగా ఉండవచ్చునని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ కోసం పని చేస్తారా?

పవన్ కళ్యాణ్ కోసం పని చేస్తారా?

చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగితే.. సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు అండగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వైసిపి, టిడిపిలు ఇచ్చే పదవుల కంటే తమ్ముడి పార్టీకి మద్దతుగా నిలబడటానికే ఎక్కువ ఛాన్స్ ఉందని అంటున్నారు.

English summary
IT is said that YSRC president YS Jaganmohan Reddy is also in touch with Chiranjeevi and he has also offered Rajya Sabha ticket to the megastar. Jagan’s advisor and MP V Vijay Sai Reddy has already struck the deal with Chiranjeevi and it will be finalised once Jagan returns from his London trip.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X