సింహంలా మీ బిడ్డ ఒక్కడే - పొత్తులపై గర్జించిన సీఎం జగన్ : అదే నా ధైర్యం..!!

పొత్తులపై సీఎం జగన్ గర్జించారు. తోడేళ్లు అన్నీ కలిసి వస్తున్నాయని..మీ బిడ్డ సింహంలా ఒక్కడే పోరాటం చేస్తాడని చెప్పుకొచ్చారు.

ఏపీలో పొత్తులపై సీఎం జగన్ గర్జించారు. తనకు వ్యతిరేకంగా పార్టీలు పొత్తులతో కలుస్తున్న తీరును ఎండగట్టారు. తనకు ఎవరితో పొత్తులు ఉండవని స్పష్టం చేసారు. తాను నమ్ముకున్నది ఆ దేవుడిని..ప్రజలనే అని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో తోడేళ్లు అన్ని కలిసి వస్తున్నాయని..మీ బిడ్డ సంహం లాగా ఒక్కడే పోరాటం చేస్తాడని చెప్పారు. తనకు మీడియా..దత్త పుత్రుల మద్దతు లేదన్నారు. తన పాలనలో జరుగుతున్న సంక్షేమం గతంలో సీఎంగా ఉన్న ముసలాయన పాలనలో ఎందుకు జరగలేదని నిలదీసారు. వచ్చే ఎన్నికల్లో మాట మీద నిలబడే మీ బిడ్డ ఒక వైపు..వెన్నుపోట్లు పొడిచే వాళ్లు మరోవైపు ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను భయపడనని..తనకు ప్రజల మీద నమ్మకం ఉందంటూ ముఖ్యమంత్రి జగన్ పొత్తుల పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

నేను నమ్ముకుంది వారినే..నా ధైర్యం అదే

నేను నమ్ముకుంది వారినే..నా ధైర్యం అదే


ముఖ్యమంత్రి జగన్ వినుకొండ పర్యటనలో భాగంగా జగనన్న చేదోడు మూడో విడత నిధులు విడుదల చేసారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పుకొచ్చారు. రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం 11.04 శాతం గ్రోత్ రేటుతో పరిగెత్తుతుందని వివరించారు. కరోనా సమయంలోనూ..ఇప్పుడూ ఎప్పుడూ పేదలకు ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పుకొచ్చారు. గతంలో ముసలాయన ప్రభుత్వంలో ఈ రకంగా పేదలకు మేలు చేసే కార్యక్రమాలు ఎందుకు జరగలేదని నిలదీసారు. అప్పుడు ఇదే రాష్ట్రం..ఇదే బడ్జెట్ అని చెప్పారు. కానీ, ప్రతీ వర్గాన్ని నాడు మోసం చేసారని వివరించారు. గతంలో ఉన్నది గజ దొంగల ప్రభుత్వమని చెప్పారు. తనకు వారిలాగా మీడియా..దత్తపుత్రుడు మద్దతు లేదని..తాను నమ్ముకున్నది దేవుడి దయ..ప్రజల ఆశీస్సులు నమ్ముకున్నానని అదే తన ధైర్యమని జగన్ స్పష్టం చేసారు.

తోడేళ్లు కలిసి వస్తున్నాయి..సింహాలా ఎదుర్కొంటా


రాష్ట్రంలో పేదల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొత్తులతో తోడేళ్లు అన్నీ కలిసి వస్తున్నాయని జగన్ వ్యాఖ్యానించారు. తాను సింహం లాగా సింగిల్ గానే పోరాటం చేస్తానని స్పష్టం చేసారు. వెన్నుపోటు దారులకు .. మీ బిడ్డకు యుద్దం జరుగుతోందని చెప్పారు. ప్రతీ విషయంలోనూ మోసం చేసే వాళ్ల పాలన కావాలా..మాట ఇస్తే అమలు చేసే మీ బిడ్డ ప్రభుత్వం కావాలా అని సీఎం ప్రశ్నించారు. దోపిడి దొంగల పాలన కావాలా .. లంచాలు వివక్ష లేని అవీనితి రహిత పాలన కావాలని అంటూ సభకు హజరైన వారిని ముఖ్యమంత్రి అడిగారు. తాను నమ్ముకున్నది తన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నిరుపేదలని స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికలు కులాల యుద్దం కాదని..క్లాస్ వార్ అని తేల్చి చెప్పారు. పెత్తందార్లు- పేదల మధ్య జరిగే యుద్దం గా అభివర్ణించారు. తాను ఎవరినీ నమ్ముకోలేదని..తాను నమ్ముకుంది ప్రజలనే అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరికీ మేలు చేయాలనే తపనతో బీ బిడ్డ ప్రభుత్వం పాలన చేస్తోందని వెల్లడించారు.

గతంలో ముసలాయన పాలన అంటూ..

గతంలో ముసలాయన పాలన అంటూ..


కొద్ది రోజుల క్రితం వరకు టీడీపీ అధినేత చంద్రబాబు ను సీఎం జగన్ ఆ పెద్దమనిషి అంటూ సంబోధించే వారు. ఇప్పుడు ఆ ముసలాయన పాలన అంటూ కొత్తగా మార్పు చేసారు. గతంలో ఎన్నికల్లో గెలిచేందుకు హామీలు ఇచ్చి అన్ని వర్గాలను మోసం చేసారంటూ వర్గాల వారీగా జగన్ వివరించారు. నాడు దుష్టచతుష్ఠయం దోచుకోవటమే లక్ష్యంగా గజ దొంగల పాలన చేసారని ఆరోపించారు. ఈ రోజు ఎక్కడా అవితీనికి వివక్ష కు అవకాశం లేని పాలన సాగుతోందని చెప్పుకొచ్చారు. అటువంటి వారి పాలన కావాలా.. నిజాయితీగా బటన్ నొక్కి ప్రతీ ఇంటికి మేలు చేసే ప్రభుత్వం కావాలా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఈ వేదిక నుంచి రాష్ట్రంలోన జగనన్న చేదోడు కింద 3,30,145 మందికి రూ 330.15 కోట్ల ఆర్దిక సాయాన్ని ముఖ్యమంత్రి విడుదల చేసారు. వినుకొండకు సీఎం జగన్ వరాలు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+