వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే బాబు ధైర్యం: మోడీని జగన్ పడగొట్టగలరా? అవిశ్వాసం ఎలా పెట్టవచ్చు, బీజేపీ లెక్క ఇదీ!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేనలు మాటల యుద్ధానికి తెరలేపాయి. ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసం పెట్టవచ్చు కదా అని పవన్ రెండు రోజుల క్రితం అన్నారు.

చదవండి: జగన్ సవాల్‌కు వెనుకంజ: అవిశ్వాసంపై ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్య, మోడీపై మళ్లీ

Recommended Video

Why Babu Saying No For No Confidence Motion ?

దీనిపై వెంటనే వైసీపీ అధినేత జగన్ స్పందించడం, సీఎం చంద్రబాబు దీని వల్ల ఒరిగేదేమీ లేదని చెప్పడం.. ఇలా సవాళ్లు, ప్రతి సవాళ్లపై నడుస్తోంది. అవిశ్వాసం పెట్టమని జనసేనాని చెబితే సై అని జగన్ చెప్పగా, మీకు దమ్ముంటే మార్చి 5న పెట్టాలని, మీకు నేను అండగా ఉంటానని పవన్ చెప్పారు. చంద్రబాబు మాత్రం అవిశ్వాసం ఆఖరి అస్త్రమని, దాని వల్ల ఇప్పుడు ఉపయోగం లేదన్నారు.

చదవండి: కేంద్రాన్ని అడుక్కున్నాం, తలాతోక లేని జగన్: బాబు కీలక సంకేతాలు, పవన్‌తో మాట్లాడుతా

అవిశ్వాసంపై జగన్ పార్టీ రెఢీ, కానీ

అవిశ్వాసంపై జగన్ పార్టీ రెఢీ, కానీ

మోడీ ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాసం పెడుతుందా లేదా అనే చర్చ సాగుతోంది. పవన్‌కు ధీటుగా స్పందించాలంటే తాము అవిశ్వాసం పెడతామని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తాము అందరిని కలుపుకొని వెళ్లి అవిశ్వాసం పెడతామని చెప్పారు. అయితే, అది ఎంత వరకు ఫలిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ ఎత్తుగడ

కాంగ్రెస్ ఎత్తుగడ

బీజేపీని ఇరుకున పడేసేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాసానికి సై అంటోంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ నేతలు తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో మాట్లాడారని తెలుస్తోంది. విభజనతో ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, అవిశ్వాసం ఆయుధంగా తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. అందుకే బీజేపీని ఇరుకున పెట్టేందుకు అవిశ్వాసం పెట్టడం లేదా మద్దతివ్వడం చేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. త్వరలో కాంగ్రెస్ ప్రకటన చేసే అవకాశాలు లేకపోలేదు.

పవన్ ఇప్పుడు చెప్పు, మీ మధ్య ఏముంది: బొత్స, అవిశ్వాసానికి బాబు నో చెప్పడం వెనుక..పవన్ ఇప్పుడు చెప్పు, మీ మధ్య ఏముంది: బొత్స, అవిశ్వాసానికి బాబు నో చెప్పడం వెనుక..

రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం లేదా విశ్వాస తీర్మానం లేదు

రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం లేదా విశ్వాస తీర్మానం లేదు

రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం లేదా విశ్వాస తీర్మానం అన్న అంశాన్ని ప్రస్తావించలేదు. 75వ అధికరణ ప్రకారం కేంద్రమంత్రి మండలి లోకసభకు బాధ్యత వహిస్తుంది. లోకసభలో అధికార పక్షానికి మెజార్టీ తగ్గితే రాజీనామా చేయాలి. కాబట్టి మెజార్టీ ఉన్నంత కాలం ఆ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు.

ఎన్డీయేకు 332 మంది బలం, ఏపీలో ఇలా

ఎన్డీయేకు 332 మంది బలం, ఏపీలో ఇలా

ఇక, ఎన్డీయే విషయానికి వస్తే లోకసభలో 332 మంది సభ్యుల బలం ఉంది. దీంతో పాటు ఇటీవల అన్నాడీఎంకే, టీఆర్ఎస్ వంటి పార్టీలు కూడా అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ నుంచి 25 మంది ఎంపీల్లో టీడీపీకి 15 మంది, వైసీపీకి 8 మంది, బీజేపీకి ఇద్దరు ఉన్నారు. ఇందులో ఇద్దరు టీడీపీలో చేరారు.

అక్కడ తెగదెంపులు, టీడీపీని వదులుకోలేం: బీజేపీ మంత్రి సంచలనం, అనితది నిజమేనని విష్ణుఅక్కడ తెగదెంపులు, టీడీపీని వదులుకోలేం: బీజేపీ మంత్రి సంచలనం, అనితది నిజమేనని విష్ణు

అందుకే ఉపయోగం లేదని చంద్రబాబు, ఇదీ లెక్క

అందుకే ఉపయోగం లేదని చంద్రబాబు, ఇదీ లెక్క

ఎన్డీయేలో బీజేపీకి 273 మంది ఎంపీలు ఉన్నారు. స్పీకర్ కూడా ఉన్నారు. ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. ఒకవేళ టీడీపీ అవిశ్వాసానికి మద్దతు తెలిపినా, ఆ పార్టీకి ఉన్న 15 నుంచి 17 మంది ఎంపీలు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసినా ఎన్డీయేకు వచ్చే నష్టం లేదు. అందుకే చంద్రబాబు ఉపయోగం లేదని చెప్పారని అంటున్నారు.

అవిశ్వాసం ఎలా పెట్టవచ్చు, ఎంతమంది మద్దతు

అవిశ్వాసం ఎలా పెట్టవచ్చు, ఎంతమంది మద్దతు

లోకసభలోని రూల్ 198 అవిశ్వాస తీర్మానాన్ని తెలుపుతుంది. దీని ప్రకారం ఎవరైనా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టవచ్చు. అయితే మొదట రాతపూర్వకంగా నోటీసు ఇవ్వాలి. దానిని స్పీకర్ సభలో చదివి ఎంతమంది మద్దతు ఇస్తున్నారో తెలపమని కోరుతారు. 50 మందికి పైగా సభ్యులు తీర్మానానికి మద్దతు పలికితే ఒకరోజును తీర్మానంపై చర్చకు నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఓటింగ్ ఉంటుంది.

జగన్! సవాల్ చేశావుగా, మోడీపై దమ్ముందా, నీకు నేనున్నా, అవిశ్వాసం పెట్టు: పవన్ కళ్యాణ్జగన్! సవాల్ చేశావుగా, మోడీపై దమ్ముందా, నీకు నేనున్నా, అవిశ్వాసం పెట్టు: పవన్ కళ్యాణ్

బీజేపీకీ చిక్కులు ఉన్నాయి

బీజేపీకీ చిక్కులు ఉన్నాయి

కాగా, అవిశ్వాసం పెడితే బీజేపీకి చిక్కులు కూడా లేవని చెప్పలేం. ఇప్పటికే శివసేన, అకాలీదళ్ దూరమయ్యాయి. టీడీపీ కూడా అవిశ్వాసానికి మద్దతు పలికితే.. బయటి నుంచి మద్దతిస్తున్న అన్నాడీఎంకే వంటి పార్టీలు అండగా నిలబడాల్సి ఉంటుంది. మరోవైపు బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే మోడీపై ఆగ్రహంతో ఉన్నారు. కానీ వారు అవిశ్వాస తీర్మానం వరకు వస్తే మోడీకి వ్యతిరేకంగా ఓటు వేసే పని మాత్రం చేయరని అంటున్నారు.

English summary
The YSRCP is prepared to move a no confidence motion against the NDA government in parliament, announced YSRCP chief YS Jagan, challenging the ruling TDP to join him in mounting pressure on the centre to grant special category status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X