మోడీతో భేటీ: నాగార్జున దూరమా, పవన్‌పై నో(పిక్చర్స్)
హైదరాబాద్: యువసామ్రాట్ అక్కినేని నాగార్జున సోమవారం గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలవడంపై రాష్ట్ర రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మోడీతో భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని, తమకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని నాగార్జున చెబుతున్నప్పటికీ.. దానిని పరిశీలకులు కొట్టి పారేస్తున్నారు.
నాగార్జునకు రాజకీయాల పైన ఆసక్తి లేకున్నప్పటికీ సినీ గ్లామర్‌తో కలిసి రాష్ట్రంలో జోరు పెంచుదామనుకుంటున్న బిజెపి అమలను ఆహ్వానించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. రాజకీయాలకు తాము దూరమని చెబుతున్నప్పటికీ బిజెపి నేతలు ఒప్పించే ప్రయత్నాలు చేయకుండా ఉండరని అంటున్నారు.
ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి చెందని నాగార్జున.. వెంకయ్య నాయుడు కోరడంతో వెళ్లి మోడీని కలిశారని, అక్కడి అభివృద్ధిపై ప్రశంసల జల్లు కురిపించారని, ఇక పోటీ విషయంలోను బిజెపి నేతలు ఒప్పించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇప్పటికే అమల లోకసభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. కాగా, నాగార్జున బిజెపికి ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
పవన్ పార్టీపై...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పైన, మోడీని పవన్ కలిసిన అంశాల పైన స్పందించేందుకు నాగార్జున నిరాకరించారు. తాను రాజకీయ నాయకుడిని కాదని చెప్పారు.
మరోవైపు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న బ్రహ్మానందం కూడా త్వరలో మోడీతో భేటీ కానున్నారని ప్రచారం సాగుతోంది. త్వరలో ఆయన అపాయింటుమెంట్ కూడా ఖరారు కానుందంటున్నారు. నాలుగు రోజుల క్రితం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అహ్మదాబాదు వెళ్లి మోడీని కలిసి, మద్దతు ప్రకటించారు.

నాగార్జున - మోడీ
టాలీవుడ్ హీరో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీతో సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు.

నాగార్జున - మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీతో భేటీ అనంతరం నాగార్జున ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. గుజరాత్ అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు.

నాగార్జున - మోడీ
మోడీతో భేటీలో రాజకీయ ప్రాధాన్యం లేదని, తమకు ఎలాంటి టిక్కెట్లు అవసరం లేదని, వెంకయ్య నాయుడు చెప్పినందువల్లే తాము మోడీని కలిశామన్నారు.

పవన్ కళ్యాణ్
నాలుగు రోజుల క్రితం జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిశారు.

నాగార్జున - మోడీ
చాలా కాలంగా నరేంద్ర గురించి వింటున్నానని, ఆయన ప్రసంగాలు తనను ఉత్తేజపరిచాయని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వెల్లడించారు. సుమారు గంటపాటు నిముషాలపాటు చర్చలు జరిపారు.

నాగార్జున - మోడీ
తన అభిప్రాయాలను మోడీతో పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, మోదీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్లు నాగార్జున పేర్కొన్నారు.

నాగార్జున - మోడీ
ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ఆయన అన్నారు. తన భార్య అమల ఎంపి టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నానని వస్తున్న వార్తలను నాగార్జున ఖండించారు.

నాగార్జున - మోడీ
అభివృద్ధిలో గుజరాత్ దూసుకు వెళ్తోందని, పలు అభివృద్ధి ప్రాజెక్టులను స్వయంగా చూశానని నాగార్జున పేర్కొన్నారు. గుజరాత్‌లో 24 గంటలూ విద్యుత్ ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. ఎన్నో గ్రామాలకు ఇంటర్నెట్, వైపై అనుసంధానం ఉందని, మోడీ పాలన చాలా బాగుందని

నాగార్జున - మోడీ
అంతకు ముందు సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన నాగార్జున వెంకయ్యనాయుడుతో సంప్రదింపులు జరిపారు. బిజెపికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నట్లు ఆయన తెలిపినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications