Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జట్టు ఇక్కడిది కాదు: జగన్‌ను ప్రశాంత్ కిశోర్ గట్టెక్కించగలరా?

ప్రశాంత్ కిశోర్ సర్వేకు పంపిన యువకుల్లో చాలామంది ఉత్తరాదికి చెందినవారని అంటున్నారు. హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చినా వారంతా హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే మాట్లాడుతున్నారు.

విజయవాడ: వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆయన తనను గట్టెక్కిస్తారని జగన్ పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

అందుకే, పార్టీ నాయకులకు కూడా ఆయనను బహిరంగంగానే పరిచయం చేశారు. ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ తన పనిని ప్రారంభించారు. నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు కూడా ఆయన సూచన మేరకే జరుగుతుందని అంటున్నారు.

ప్రశాంత్ కిశోర్ తన జట్టుతో నియోజకవర్గాలవారీగా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలంగా లేని చోట రెండో అభ్యర్థి అన్వేషణ కూడా సాగుతోంది.

అంతా ఉత్తరాది వారే

అంతా ఉత్తరాది వారే

ప్రశాంత్ కిశోర్ సర్వేకు పంపిన యువకుల్లో చాలామంది ఉత్తరాదికి చెందినవారని అంటున్నారు. హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చినా వారంతా హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే మాట్లాడుతున్నారు. నాయకులు, కార్యకర్తలు చెప్పిన అభిప్రాయాలను వారి భాషలో తర్జుమా చేసేందుకు ఒకరిద్దరు ఉన్నప్పటికీ, క్యాడర్ భావాలను యథాతథంగా సర్వే బృందానికి చేరవేయలేకపోతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం సర్వేలో పాల్గొంటున్నవారు కాకుండా మరో 100 మంది యువకులు మలివితడ సర్వేకి వస్తారని అంటున్నారు. వచ్చే 10, 15 రోజుల్లో వస్తారని సమాచారం. ఇలాంటి స్థితిలో ప్రశాంత్ కిశోర్ జగన్‌ను గట్టెక్కించగలరా అనేది ప్రశ్న.

Recommended Video

    Chandrababu Fixed YS Jagan And Pawan Kalyan For 2019 Polls
    ఏ నోట విన్నా....

    ఏ నోట విన్నా....

    ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఎవరి నోట విన్నా ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ (పికె) పేరే వినిపిస్తోంది. మోడీని ప్రధానిగా, నితీష్‌ను బీహార్ ముఖ్యమంత్రిగా చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ క్యాడర్‌కు జగన్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. (PK)

    అన్ని నియోజకవర్గాల్లోనూ...

    అన్ని నియోజకవర్గాల్లోనూ...

    ఎన్నికలు రెండేళ్లు ఉండగానే తన బృందాలను ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దించారు. 200 మంది యువకులను ఎంపిక చేసి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు పంపించారు. పార్టీ బలం గురించి, పార్టీ, అక్కడున్న కో-ఆర్డినేటర్ బలమూ బలహీనతల గురించి వీరు ఆరా తీస్తున్నారు. ముందుగా నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, వార్డు అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతో ఈ బృందం సమావేశమవుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలపై వీరు ఆరా తీస్తున్నారు. (PK)

    ఇలా కూడా...

    ఇలా కూడా...

    ఇప్పుడున్న పార్టీ సమన్వయకర్త గురించి పార్టీ క్యాడర్ ఏమనుకుంటోంది? ఒకవేళ అభ్యర్థిని మార్చాల్సి వస్తే, ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయాలపై ద్వితీయ శ్రేణి నాయకులతో పికె బృందం సభ్యులు మాట్లాడుతున్నారు. కేవలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీగురించి మాత్రమే వీళ్లు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మిగిలిన పార్టీల గురించి వీరు ప్రశ్నించడం లేదని సమాచారం.మీడియా టీమ్‌ను జిల్లా కేంద్రాలకు పంపిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులతో వీరు మాట్లాడుతున్నారు. (PK)

    పార్టీ లోపాల గురించే..

    పార్టీ లోపాల గురించే..

    కేవలం వైసిపిలో ఉన్న లోపాలు, వాటిని సరిదిద్ధాల్సిన తీరు గురించి మాత్రమే జిల్లాలకు వెళ్లిన మీడియా టీమ్ సభ్యులు మాట్లాడుతున్నారు. వీరు సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ బృందానికి అందచేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల గురించి పార్టీ వద్ద ఉన్న సమాచారాన్ని ఈ బృందం సేకరించిన సమాచారంతో సరి చూస్తారు. రెండింటినీ కలిపి విశ్లేషించి పార్టీలో ఉన్న లోపాలను సరిదిద్దుతారు. (PK)

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+