వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎస్ భేటీ: తెలంగాణపై ఏదైనా సోనియా గాంధీయే?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi - D Sriniavas
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయమే కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ఆమె పచ్చజెండా ఊపితే తప్ప రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. సీమాంధ్ర ఆందోళనలు, ఉద్యోగుల సమ్మె, హైదరాబాద్‌లో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ, సీమాంధ్ర ప్రాంత నేతల వ్యతిరేకత వంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం మొత్తం పరిస్థితిని సమీక్షిస్తోంది.

శుక్రవారం జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తాజా పరిస్థితులు సమీక్షించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర నేతల వాదనలు విన్న కేంద్ర మంత్రి ఆంటోనీ శుక్రవారం సోనియాగాంధీకి పరిస్థితిని వివరిస్తారని చెబుతున్నారు. ఆంటోనీ కమిటీ రాష్ట్రానికి వెళ్లి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సూచించిన వారిని కలుసుకునే విషయంపైనా కోర్‌కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఆంటోనీ కమిటీ హైదరాబాద్ వెళ్లి వచ్చిన తర్వాతే కేంద్రంలో కదలిక ఉంటుందని అంటున్నారు. సీమాంధ్రలో పరిస్థితి ప్రశాంతంగా మారేంతవరకూ ఢిల్లీలో తెలంగాణపై వేగవంతంగా నిర్ణయాలు ఉండకపోవచ్చునని సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు. ఈ నెల 19న కేంద్ర కేబినెట్‌లో నోట్ ఖరారవుతుందని తెలంగాణ నేతలు మాత్రం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్ణయం ఆలస్యమైందని, ప్రజల ఆందోళనలు ఉపశమించాలంటే త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానానికి జైపాల్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి పెంచేందుకు పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన శుక్రవారం ఉదయమే సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకుని వెళ్లాలని ఆయన సోనియాకు విజ్ఝప్తి చేసినట్లు సమాచారం. కేబినెట్ నోట్ తయారీకి పెద్దగా సమయం పట్టదని కూడా చెబుతున్నారు. ఇప్పటికే సాంకేతిక అంశాలు సేకరణ పూర్తయిందని, రాజకీయ నిర్ణయం చెప్పి, తగిన దిశా నిర్దేశం చేస్తే దాని ప్రకారం నోట్ తయారు చేస్తారని అంటున్నారు. ఇందుకు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ నెల 25 నుంచి అక్టోబర్ 1 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఆయన తిరిగి వచ్చేవరకూ కేంద్ర కేబినెట్‌లో నోట్‌పై చర్చించే అవకాశాలు లేవనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇది కూడా సోనియా గాంధీ సూచనలపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

English summary
PCC former president D Sriniavas met Congress president Sonia Gandhi on Telangana issue. Sonia Gandhi may take the stalk of the situation and procede on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X