ఇలా అన్నారు: జగన్‌తో కలిసి పని చేసేందుకు పవన్ కళ్యాణ్ రెడీ
ఇప్పటికే బీజేపీ - టీడీపీ కూటమికి దూరం జరిగిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు మరో అడుగు ముందుకు వేశారు.
హైదరాబాద్: ఇప్పటికే బీజేపీ - టీడీపీ కూటమికి దూరం జరిగిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు మరో అడుగు ముందుకు వేశారు. ప్రత్యేక హోదా పైన అవసరమైతే వైసిపి అధినేత వైయస్ జగన్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధమని వ్యాఖ్యానించడం గమనార్హం.
ప్రత్యేక హోదా తదితర అంశాలపై చిత్తశుద్ధితో పోరాటం చేయాలని, ఈ విషయంలో అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలనేది తన ఉద్దేశ్యమని చెప్పారు. అవసరమైతే ప్రతిపక్ష పార్టీతో కలిసి పోరాడుతానని చెప్పారు. ఇతర పార్టీలు కూడా ముందుకు వస్తే తాను కూడా వారితో కలుస్తానని చెప్పారు.

నిన్న పోటాపోటీ.. నేడు ఇలా..
ప్రత్యేక హోదా పోరులో నిన్నటి వరకు జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్‌లా కనిపించింది. బీజేపీ హోదా పైన చేతులెత్తేసింది. టిడిపి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ చాలా బెట్టర్ అని చెబుతోంది. ఈ నేపథ్యంలో హోదా పోరు రంగంలో పవన్, జగన్‌లు ఉన్నారు.
హోదా కోసం ఇరువురు మధ్య పోటాపోటీ కనిపించింది. జల్లికట్టు స్ఫూర్తిగా జనవరి 26వ తేదీన విశాఖ ఆర్కే బీచ్ వద్ద యువత హోదా కోసం నిరసన తెలపాలనుకుంది. దీనికి పవన్ మద్తతు పలికారు. జగన్ స్వయంగా క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటానని ప్రకటించారు.
అప్పుడు కూడా ఇరువురి మధ్య హోదా విషయంలో ఆధిపత్య పోరు కనిపించిందనే వాదనలు ఉన్నాయి. జగన్ విశాఖ విమానాశ్రయం నుంచి తిరిగి పంపించడం వేరే విషయం. ఆర్కే బీచ్ పిలుపుకు ఇద్దరు మద్దతు పలికారు. అయితే ఇతరుల నుంచి ఎక్కువగా పవన్ వైప మొగ్గు చూపారు. పవన్ నేతృత్వం వహించాలని కాంగ్రెస్ పార్టీ కూడా ఆశించింది.
కాంగ్రెస్ పార్టీ నేత సీ రామచంద్రయ్య మాట్లాడుతూ.. హోదా కోసం పవన్ ఉద్యమించేందుకు ముందుకు వస్తే తాము అండగా నిలబడతామని ప్రకటించారు. ఎక్కువ ప్రజా సంఘాలు కూడా ఈ ఉద్యమంలో పవన్‌నే గుర్తించాయని చెప్పవచ్చు. జగన్ ఉద్యమాన్ని రాజకీయ పరంగానే చూస్తున్నారు.
ఇబ్బంది..జగన్ కలిసేనా?
అలాంటిది, ఇప్పుడు పవన్ తాను జగన్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధమని ప్రకటించడం గమనార్హం. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన హోదా ఉద్యమం గురించి పవన్ ప్రత్యేకంగా మాట్లాడలేదు. కానీ వైసిపి నేతలు రోజా వంటి వారు మాత్రం.. జగన్ ఉద్యమంలోనే చిత్తశుద్ధి ఉందని, పవన్ హోదాలో చిత్తశుద్ధి లేదని ప్రకటించారు.
అంతేకాదు, ఇప్పుడు పవన్ తాను జగన్ సహా ఎవరితోనైనా కలిసి ఉద్యమించేందుకు సిద్ధమని చెప్పారు. దీని వల్ల జగన్‌కు రెండు మైనస్‌లు ఉన్నాయని అంటున్నారు.
ఇప్పటి దాకా ఆ పార్టీ పవన్ ఉద్యమ పోరును విమర్శించింది. అది పక్కన పెడితే.... ఆ హోదా పోరులో జగన్ కంటే పవన్ కళ్యాణ్‌కే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి. కాబట్టి జగన్ కలుస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications