బీజేపీ కోసం చంద్రబాబు ఆపిన సీట్లు వైసీపీ ఖాతాలోకేనా?
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ కోసం జట్టు కట్టిన టీడీపీ-జనసేన ఇవాళ తమ తొలి జాబితా ప్రకటించాయి. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన ఈ జాబితాలో 118 సీట్లు ఉన్నట్లు చెప్పినా చివరికి 99 పేర్లు మాత్రమే వెల్లడించారు. ఇందులో టీడీపీ 94 సీట్లు, జనసేన ఐదు సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో 19 చోట్ల జనసేన సీట్లు ఖరారు కావాల్సి ఉంది. అయితే 118 సీట్లు పూర్తయ్యాక మిగిలిన 57 సీట్లలో బీజేపీకి కూడా ఇవ్వాల్సి ఉంది.
వచ్చే వారం బీజేపీతో పొత్తు కుదురుతుందని, అందుకోసమే వారు అడుగుతున్న సీట్లు పక్కనబెట్టినట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. టీడీపీ, జనసేన నేతలు చెబుతున్న ప్రకారం బీజేపీ కనీసం 10-20 సీట్లు అడుగుతోంది. ఇందులో 15 సీట్ల వరకూ కేటాయించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ 15 సీట్లలో బీజేపీ గెలిచేవి ఎన్ని అనే ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీకి ఎక్కువ సీట్లు కేటాయించడం అంతిమంగా ఏ వైసీపీని అయితే ఓడించేందుకు వీరు కూటమి కట్టారో ఆ పార్టీకే మేలు చేసేలా కనిపిస్తోంది.

ఎందుకంటే ఇవాళ ప్రకటించని 57 సీట్లలో బీజేపీకి 15 సీట్లు కేటాయిస్తే మరో 42 సీట్లు టీడీపీకి మిగులుతాయి. అలాగే వీటిలో చాలా మటుకు కీలకమైన స్ధానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీకి నికరంగా ఓటు బ్యాంకు ఉన్న స్ధానాలు ఒకటీ అరా తప్ప ఏవీ కనిపించడం లేదు. కానీ 10 సీట్లకు పైగా బీజేపీకి కేటాయిస్తే వాటిలో తిరిగి అధికార వైసీపీకే గెలుపు స్దానాలు ఉంటాయి.
దీనికి ప్రధాన కారణం ఆయా సీట్లలో కేవలం టీడీపీ, జనసేన ఓటు బ్యాంకును నమ్ముకుని బీజేపీ బరిలోకి దిగుతుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య ఓట్ల బదలాయింపు జరుగుతుందో లేదో గ్యారంటీ లేదు. అలాంటి స్ధితిలో బీజేపీకి ఇరు పార్టీల ఓట్లు పడటం అంటే కష్టమే. అలాంటి పరిస్ధితుల్లో వైసీపీకే అంతిమంగా మేలు జరుగుతుంది.
Download











Click it and Unblock the Notifications