పవన్ తో సహా కేసులున్న ఎమ్మెల్యేలను నిల్చోబెట్టిన చంద్రబాబు!!

ఢిల్లీ వేదికగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దాడులపైన నిన్న దీక్ష చేసిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి తన దీక్ష ద్వారా దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసి, ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇక జగన్ చర్యకు ప్రతిచర్యగా నేడు ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పైన శ్వేత పత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే.

జగన్ ప్రభుత్వంలో ప్రత్యర్థి పార్టీల నేతలపై కేసులు
శ్వేత పత్రం విడుదల ద్వారా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులను, దారుణాలను ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎదుర్కొన్న కేసులను చంద్రబాబు అందరికీ అర్థమయ్యేలా వెల్లడించారు. శాసనసభ వేదికగా నేడు శ్వేత పత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు జగన్ ప్రభుత్వ హయాంలో తనతో పాటు పవన్ కళ్యాణ్, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా ఎంతోమంది నేతలు కేసులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

With chandrababu request MLAs including pawan kalyan stand up in the assembly who have cases in jagan regime

సభలో ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఆదేశం
తనపై జగన్ సర్కార్ 17 కేసులు, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టిందని గుర్తు చేశారు .ఇక ఇదే సమయంలో శాసనసభలో ఒక అరుదైన దృశ్యం కూడా ఈ సందర్భంగా చోటుచేసుకుంది. వైసిపి ప్రభుత్వ హయాంలో కేసులు ఎదుర్కొన్న నేతలందరూ ఒక్కసారి లేచి నిలబడవలసిందిగా సభలో చంద్రబాబు కోరడంతో ఒక్కసారిగా సభలో మెజారిటీ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు.

పవన్ తో సహా శాసనసభలో నిలబడ్డ ఎమ్మెల్యేలు
చంద్రబాబు అడిగిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు శాసనసభలో పదుల సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలు వెంటనే లేచి నిలుచున్నారు. శాసనసభలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యుల పైన గత ప్రభుత్వ హయాంలో కేసులు పెట్టారు. సభలో కూర్చున్న సభ్యుల సంఖ్య, నిలుచున్న సభ్యుల సంఖ్య కంటే తక్కువగా ఉంటుందని కూటమి శ్రేణుల అభిప్రాయం.

జగన్ వేధింపులకు ఇదే రుజువు అన్న చంద్రబాబు
గత ప్రభుత్వ హయాంలో కేసులు నమోదైన ఎమ్మెల్యేలు లేచి నిలుచున్న వెంటనే వారిని ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు గత ప్రభుత్వం మీద పోరాడిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి వేధించారు అని చెప్పడానికి ఇదే రుజువు అని పేర్కొన్నారు. అయితే జగన్ వేధింపులను జనం అర్థం చేసుకున్నారని, ఎవరిపైన ఎక్కువ కేసులు పెట్టి జగన్ వేధించారో వారిని అంత భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించారని చంద్రబాబు పేర్కొన్నారు.

జగన్ కు ఈ చర్యతో చంద్రబాబు షాక్
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా గత ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థి పార్టీల నాయకుల పైన పెట్టిన కేసుల గురించి చంద్రబాబు ప్రస్తావించిన సమయంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఇక దీని ద్వారా నిన్న ఏపీ ప్రభుత్వ దాడులు అంటూ ఢిల్లీ వేదికగా మాటల దాడి చేసిన జగన్ కు చంద్రబాబు ఊహించని గట్టి షాక్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+