దుర్గమ్మ ఆలయంలో అవినీతిపై ఆధారాలతో.. పవన్ కు పోతిన సవాల్!

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఏపీలో అవినీతి రాజ్యమేలుతుందని, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రూ.4 కోట్ల అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని వైయస్సార్‌సీపీ నాయకుడు పోతిన మహేష్‌ వెల్లడించారు. బుద్దా వెంకన్న దుర్గమ్మ ఆలయంలో అవినీతికి మూల కారకుడని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తన బినామీకి ఆలయ పార్కింగ్, టోల్‌ కాంట్రాక్టు కట్టబెట్టారని ఆయన తెలిపారు.

దుర్గమ్మ ఆలయ అవినీతిపై మండిపడిన పోతిన మహేష్
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే దుర్గమ్మ ఆలయంలో బుద్ధా వెంకన్న పెత్తనం పెరిగిపోయిందని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆలయ అధికారులను బెదిరించి ఆయన అవినీతికి పాల్పడుతున్నారని పోతిన మహేష్‌ చెప్పారు. మరోవైపు కొందరు ఆలయ అధికారులు కూడా బుద్దా వెంకన్నకు సహకరిస్తున్నారని ఆరోపించారు. పార్కింగ్ కాంట్రాక్టర్లపై అమ్మవారు ఆధారపడి ఉన్నారా చెప్పాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను నిలదీశారు.


దుర్గమ్మ ఆలయ అవినీతిపై చర్చకు సిద్ధమా
దుర్గమ్మ ఆలయంలో అవినీతిపై తన మాటలకు కట్టుబడి ఉన్నానన్న వైయస్సార్‌సీపీ నాయకుడు, టీడీపీ నాయకులకు దమ్ముంటే వాటిపై ఏ వేదికపై అయినా చర్చకు సిద్దమని తేల్చి చెప్పారు. గత ఏడాది జూన్‌లో ఆలయం పార్కింగ్, టోల్‌ఫీజు కాంట్రాక్ట్‌ను రూ.1.87 కోట్లకు అప్పగించారని, నిబంధనల ప్రకారం రెండో ఏడాది కూడా కాంట్రాక్ట్ పొడిగించాలంటే కాంట్రాక్ట్‌ మొత్తాన్ని 10 శాతం పెంచాలని కానీ అలా జరగలేదన్నారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఇవి కనిపించటం లేదా
అయితే అవన్నీ తుంగలో తొక్కిన దేవాదాయ కమిషనర్‌ కాంట్రాక్ట్‌ను పొడిగిస్తూ, ఈనెల 9న ఉత్తర్వులు జారీ చేశారని పోతిన మహేష్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఆరు నెలల పాటు జూన్‌ నుంచి నవంబరు వరకు ఆలయానికి ఎలాంటి ఫీజు చెల్లించకుండానే పార్కింగ్, టోల్‌ వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారని, ఈ అవినీతి చంద్రబాబుకు, పవన్ కు కనిపించటం లేదా అన్నారు.

షాపుల విషయంలోనూ అవినీతి
మరోవైపు ఆలయ ఆవరణలో కొత్త నిర్మాణం నేపథ్యంలో మరో వైపునకు మార్చిన 24 షాపుల విషయంలోనూ అవినీతి చోటు చేసుకుందని పోతిన మహేష్ వెల్లడించారు. ఒక్కో షాప్‌కు రూ.1.06 లక్షల అద్దె చెల్లిస్తుండగా, వాటిని మార్చడం వల్ల నష్టపోయారన్న సాకు చూపి, అద్దె 40 శాతం తగ్గించడంతో పాటు, అగ్రిమెంట్‌ను మూడేళ్లు పొడిగించారని, ఇది కూడా నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.

With evidence of corruption in Durgamma temple pothina mahesh challenge to Pawan kalyan

దోచుకో పంచుకో తినుకో అన్నట్టు ప్రభుత్వ విధానం
ఇందు కోసం ఒక్కో షాపు నుంచి బుద్ధా వెంకన్న రూ.5 లక్షల చొప్పున వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయని పోతిన మహేష్ పేర్కొన్నారు. గతంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం, ప్రతి పథకాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో అమలు చేస్తే, టీడీపీ ప్రభుత్వం యథేచ్ఛగా దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) అమలు చేస్తోందని పోతిన మహేష్‌ విమర్శలు గుప్పించారు.

బుద్దా వెంకన్న బినామీకే కాంట్రాక్ట్‌ లా
ఆలయ అన్నదానంలో వినియోగించే స్టీల్‌ టేబుళ్ల సేకరణలో కూడా బుద్దా వెంకన్న బినామీకే కాంట్రాక్ట్‌ ఇచ్చారని తెలిపారు. రూ.1.35 కోట్ల విలువైన మరో కాంట్రాక్ట్‌ను టెండర్‌ పిలవకుండానే నామినేషన్‌ విధానంలో ఇచ్చారని ఫైర్ అయ్యారు. దుర్గ గుడిలో జరుగుతున్న అవినీతిపై పవన్ మాట్లాడాలని పోతిన మహేష్ ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+