అవును వారిద్దరూ ఐఎఎస్ లే, కాని ఐదువందలతో పెళ్ళి చేసుకొన్నారు.

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ :పెద్ద నగదు నోట్ల రద్దుతో ఐదువందల రూపాయాలతో వివాహం చేసుకొన్న గుజరాత్ జంటను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా అభినందించాడు. ఈ ఘటన మరువకముందే ఇద్దరు ఐఎఎస్ అధికారులు రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొన్నారు. వివాహనికి ఫీజు కింద చెల్లించాల్సిన ఐదువందల రూపాయాలను ఖర్చు చేసి వివాహం చేసుకొని ఆదర్శంగా నిలిచారు.

ఐఎఎస్ అధికారులు వివాహం జరుపుకోవాలంటే అంగరంగ వైభవంగా చేసుకోవచ్చు. ఇద్దరూ ఐఎఎస్ అధికారులు పెళ్ళంటే ఎంత గ్రాండ్ గా చేసుకోవచ్చో ఊహించుకోవచ్చు. అయితే పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ఇద్దరు ఐఐెఎస్ అధికారులు సాదాసీదాగా వివాహం చేసకొన్నారు. బింధు కోర్టు లో వివాహం చేసుకొన్నారు.

with five hundred rupees expenditure ias officers married

కోర్టు ఫీజే పెళ్ళి ఖర్చు

గుజరాత్ కు చెందిన నవదంపతులు పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా కేవలం ఐదువందల రూపాయాలతో వివాహం చేసుకొన్నారు. ఈ జంటను ప్రధానమంత్రి మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో అభినందించారు. ఈ జంటను ఆశీర్విదించారు.మధ్యప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి ఆశిష్ వశిష్ట, ఆంద్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన సలోని సిదానా కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు. ఆశిష్ రాజస్థాన్ రాష్ట్రం. సలోనిది పంజాబ్. నవంబర్ 28వ, తేదిన మధ్యప్రదేశ్ లో వీరిద్దరూ సాధాసీదాగా వివాహం చేసుకొన్నారు. కోర్టు ఫీజు ఐదువందల రూపాయాలు చెల్లించారు. ఈ ఫీజే వారు పెళ్ళి కోసం చేసిన ఖర్చు.

2013 బ్యాచ్ కు చెందిన వీరిద్దరూ ముస్సోరిలో శిక్షణ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆనాటి నుండి వీరిద్దరూ తమ ప్రేమను కొనసాగిస్తున్నారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బింద్ కోర్టులో తమ వివాహనికి అనుమతి ఇవ్వాలని వారు ధరఖాస్తు చేసుకొన్నారు. దీంతో వారికి నవంబర్ 28వ, తేది అనుమతి ఇచ్చింది.రెండు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో ఇద్దరు వివాహం చేసుకొన్నారు.వీరిద్దరూ పెళ్ళి చేసుకోవడంతో ఆంద్రప్రదేశ్ నుండి సలోని మధ్యప్రదేశ్ క్యాడర్ కు మారే అవకాశం దక్కింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
two ias officers married with five hundred rupees expenditure only. ashish vashita native of rajastan, saloni belongs to punjab. they are love from the trainig period in 2013. ashish now working in madhya pradesh, saloni working in andhra pradesh state. ashish apply for permission to marrage , court give them permission to marrage, on nov 28 they got marred, they expenditure this marrage five hundred rupees only.
Please Wait while comments are loading...