వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణమ్మ పరవళ్లు: ప్రాజెక్టులన్నీ ఫుల్లు -జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత -ప్రకాశం బ్యారేజీ

|
Google Oneindia TeluguNews

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ప్రాజెక్టులన్నీ నిండుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదికి వదర హోరు కొనసాగుతోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు ఎగువన ప్రధాన జలాశయాలన్నీ దాదాపు నిండిపోయాయి. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌ గరిష్ఠ సామర్థ్యం 129.72 టీఎంసీలకుగాను.. 98 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఆల్మట్టిలోకి 4,20,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌కు 4,23,000 క్యూసెక్కులు వస్తుంటే.. 4,17,740 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శనివారం నాటికి..

షాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనంషాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనం

viral video: ఒళ్లు గగుర్పొడిచే బీభత్సం -లోయలోకి కుప్పకూలిన ఘాట్ రోడ్డు -NH 707 మూసివేతviral video: ఒళ్లు గగుర్పొడిచే బీభత్సం -లోయలోకి కుప్పకూలిన ఘాట్ రోడ్డు -NH 707 మూసివేత

 జూరాల ప్రాజెక్ట్‎కు వరద..47 గేట్లు ఎత్తివేత

జూరాల ప్రాజెక్ట్‎కు వరద..47 గేట్లు ఎత్తివేత

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతుంది. ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు జూరాల 47 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఇన్ ఫ్లో 4,77,000 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4,76,047 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 316.840 మీటర్లుగా ఉంది. జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.462 టీఎంసీలుగా ఉంది. అటు,

 శ్రీశైలానికి వదర పోటు 10 గేట్లు ఎత్తివేత

శ్రీశైలానికి వదర పోటు 10 గేట్లు ఎత్తివేత

మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల సరిహద్దులోని శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఇన్ ఫ్లో 4,82,600 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5,34,189 క్యూసెక్కులుగా ఉంది. అలాగే శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884 అడుగులకు చేరింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 207.4103 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరోవైపు కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. అలాగే హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డి హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 20వేల క్యూసెక్కులు విడుదల చేశారు. అక్కణ్నుంచి సాగర్‌లోకి ప్రవాహం వస్తోంది.

 నాగార్జున సాగర్‌కు జలకళ

నాగార్జున సాగర్‌కు జలకళ

నల్గొండ-గుంటూరు జిల్లాల సరిహద్దులోని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 4,54,537 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 36,537 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా...ప్రస్తుత నీటి మట్టం 566 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 248.0438 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మొత్తంగా 312 టీఎంసీల సామర్థ్యానికిగాను.. శుక్రవారం సాయం త్రానికి నీటి నిల్వ 232 టీఎంసీలకు చేరింది. మూడు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతుందని అధికారవర్గాలు వెల్లడించాయి.

 పులిచింతలతోనూ విద్యుత్ ఉత్పత్తి..

పులిచింతలతోనూ విద్యుత్ ఉత్పత్తి..

శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి నాగార్జునసాగర్‌లో 560 అడు గుల మట్టం వద్ద 232.62 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఇక సాగర్‌లో విద్యుదు త్పత్తి చేస్తూ వదులుతున్న నీటిలో 27,873 క్యూసెక్కులు పులిచింతల ప్రాజెక్టుకు చేరు తున్నాయి. తెలంగాణ సర్కారు పులి చింతలలో విద్యుదుత్పత్తి చేస్తూ 18,370 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీకి వదులు తోంది.ఏపీలో ఈ ఏడాది కూడా భారీగా వరద ప్రవాహం చేరుతుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా వరద జలాలను ఒడిసి పట్టి ప్రాజెక్టులు, చెరువులను నింపడం ద్వారా వాటి పరిధిలోని ఆయకట్టు మొత్తానికి సాగు నీరు అందించేందుకు జగన సర్కారు చర్యలు చేపట్టింది రైతు.యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. ఆయకట్టు చివరి భూములకు సైతం నీరందించేందుకు జల వనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

Recommended Video

Janasena Silence Over BJP's Fight Against AP Govt| YSRCP | Tippu Sultan | AP | Oneindia Telugu
ప్రకాశం బ్యారేజీ 30 గేట్లు ఎత్తివేత

ప్రకాశం బ్యారేజీ 30 గేట్లు ఎత్తివేత

కృష్ణా నది దిగువున.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద శుక్రవారం వరద పెరిగింది. రాత్రి 9 గంటలకు బ్యారేజీకి 30 వేల క్యూసెక్కులు రాగా, 30 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. 22,500 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తోంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ.. బ్యారేజీ వద్ద 12 అడుగుల మట్టాన్ని ఉంచి, వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 7,912 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు, 10,458 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తు న్నారు. ఇక పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్రలో వరద తగ్గుతోంది. డ్యామ్‌లోకి 52,140 క్యూసెక్కులు చేరుతుండగా 29,500 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మరోవైపు,

కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతం పరిధిలో ఇరు రాష్ట్రాల జల వనరుల నిర్వహణను నదీ యాజమాన్య బోర్డులు స్వీకరించే కార్యక్రమం మొదలైంది. కృష్ణా నదిపై 36, గోదావరి నదిపై 71 ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసి 15 రోజులైంది. మరో 75 రోజుల్లో అప్పగింతల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దాంతో రెండు బోర్డులు కూడా గెజిట్‌ అమలుకు కసరత్తును ముమ్మరం చేశాయి. తెలుగు రాష్ట్రాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరపుతున్నాయి. గోదావరి నదీ యాజమాన్య బోర్డు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ గెజిట్‌ అమలుపై 11 మంది అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.

English summary
The Krishna River continues to flood due to heavy rains in the upper states. With this, by Saturday, both the projects in Telangana and Andhra Pradesh were almost completely filled. Water is being discharged from Jurala Project, Srisailam Project and Nagarjuna Sagar Project. Water is being released into the sea as the flow at prakasam barrage increases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X