ప్రియుడిని వశం చేస్తానని మంత్రగాడు నమ్మబలికి దారుణం చేశాడు
కర్నూలు: కర్నూలు జిల్లాలోని గూడురు గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తన మంత్రశక్తులతో ప్రియుడి దగ్గరకు చేరుస్తానని చెప్పి తల్లీ కుతుళ్ళను గిడ్డయ్య అనే మంత్రగాడు దారుణంగా హత్య చేశాడు. పది రోజుల కిందట జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిందితుడు గిడ్డయ్య పరారీలో ఉన్నాడు. తల్లీకూతుళ్ళ శవాలు బయటపడటంతో ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించాయి. దూరమైన ప్రియుడిని చేతబడి చేసి నీ వశం చేస్తానని మంత్రగాడు నమ్మబలికాడు. చివరికి తల్లీకూతుళ్లను హత్య చేశాడు.

గుంటూరుకు చెందిన మద్దమ్మ కూలిపని చేస్తూ జీవనం సాగించేది. రోజులాగా కూలీకి వెళ్తున్న క్రమంలో గిడ్డయ్య దగ్గరయ్యాడు. తనకు దూరమైన ప్రియుడి గురించి మంత్రగాడు గిడ్డయ్యకు చెప్పి సాయం కోరింది. దాన్ని ఆసరా చేసుకుని మంత్రగాడు గిడ్డయ్య తన మంత్రాలతో క్షుద్ర పూజలు చేసి ప్రియుడ్ని ఆమె వశం చేస్తానని చెప్పాడు.
తల్లీ, కూతురు గిడ్డయ్య దగ్గరికెళ్లిన తరువాత ఇద్దరినీ చున్నీతో ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. మద్దమ్మ శవాన్ని వెల్దుర్తి మండలం రామర్లకోట శివారులో పడేశాడు. ఈమె కూతురు మృతదేహం కల్లూరు మండలంలో బయటపడింది. కుళ్ళిపోయి దుర్వాసన రావడంతో గొర్రెల కాపరులు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications