ఫోన్ చేసి వేధింపులు: ఆకతాయికి చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పిన మహిళ
తూర్పుగోదావరి: ఓ మహిళతో సెల్‌ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడిన ఓ ఆకతాయిని ఆమె గురువారం కలెక్టరేట్ వద్ద చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. బాధితురాలి కథనం ప్రకారం.. కాకినాడ సంజయ్‌నగర్‌కు చెందిన చిన్న పెయింటర్‌గా పనిచేస్తున్నాడు.
అతడు తన సెల్‌ఫోన్ నుంచి కాకినాడకు చెందిన ఓ మహిళకు ఫోన్ చేశాడు. ఆమె రాంగ్ నంబర్ అని చెప్పి పెట్టేసినా అతడు తరచూ ఫోన్ చేస్తూ అసభ్యకరంగా సంభాషిస్తున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది.

ఆ మహిళ గురువారం కాకినాడ కలెక్టరేట్ వద్ద పనిచేసుకుంటోంది. ఇంతలో చిన్నా ఆమెకు ఫోన్ చేశాడు. తన స్నేహితురాలి సూచన మేరకు ఆ మహిళ చిన్నతో ఫోన్‌లో మాట్లాడి కలెక్టరేట్ వద్ద టిఫిన్ తీసుకుని రమ్మంది.
దూరం నుంచి అతడు ఫోన్ చేయడాన్ని గమనించి స్నేహితురాలితో కలిసి అతడి వద్దకు చేరుకుని చెప్పుతో కొట్టింది. స్థానికంగా ఉన్న పోలీసులు అక్కడకు చేరుకుని చిన్నను అరెస్ట్ చేసి వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. కాగా, పోకిరికి తగిన బుద్ధి చెప్పిన మహిళను మహిళా సంఘాల నేతలు అభినందించారు.












Click it and Unblock the Notifications