పిల్లలతో సహా రైలు కింద పడి తల్లి ఆత్మహత్య...శ్రీకాకుళం జిల్లాలో విషాదం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వేస్టేషన్‌లో గురువారం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో తెలియదుకాని ఓ తల్లి తన కూతురుతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
భువనేశ్వర్ నుంచి బెంగళూర్ వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఆముదాలవలస సమీపంలో చేరుకోగానే ఆ తల్లి తన కుమార్తెతో సహా రైలు కింద పడింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతులకు సంబంధించిన ఆధారాలేవీ దొరకలేదని జిఆర్‌పి పోలీసులు చెబుతున్నారు.

తల్లికి సుమారు 30 ఏళ్లు ఉంటాయని పాపకు 3 సంవత్సరాల వయస్సు ఉండొచ్చని జిఆర్‌పి పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన వారి వివరాలు, కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications