భర్త మృతి: కూతురితో సహా మహిళ ఆత్మహత్య

అప్పటి నుంచి అతని భార్య లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురవుతూ వస్తోంది. భర్త లేకుండా తాను జీవించలేనంటూ ఆమె పలుమార్లు బంధువుల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ స్థితిలో శనివారం ఉదయం లక్ష్మి తొమ్మిదో తరగతి చదువుతున్న తన కూతురు ప్రసన్నతో కలిసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.
వారిద్దరు ఆత్మహత్య చేసుకున్న సమయంలో కుమారుడు ఇంట్లో లేడని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
లేడీ టీచర్ ఆత్మహత్యాయత్నం
తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేక శనివారం ఉదయం పాఠశాల ఆవరణలోనే ఓ గిరిజన ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె పరిస్థితి ఆందోళనకరుంగా ఉంది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
బొల్లాపల్లిలోని కస్తూర్బా పాఠశాలలో జ్యోతి సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. ఆమెపై తోటి ఉద్యోగులు వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ విషయంపై ఆమె ప్రధాన ఉపాధ్యాయుడికి కూడా ఫిర్యాదు చేసింది.
ప్రధాన ఉపాధ్యాయుడు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో ఆమెపై వేధింపులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆమె పాఠశాలలో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications