ఫ్యాన్‌కు ఉరేసుకుని సీఐ భార్య ఆత్మహత్య: కారణం ఇదీ (ఫోటోలు)

విశాఖపట్నం: క్షయ వ్యాధి సోకిందన్న బాధతో ఓ పోలీసు అధికారి భార్య ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని టూటౌన్ సీఐ రమణ కుటుంబం రామ్ నగర్ ప్రాంతంలో నివాసముంటోంది.

ఆయన భార్య సునీత (38) శనివారం మధ్యహ్నాం సుమారు 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందింది. ఈమె గత 15 సంవత్సరాలుగా అల్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

ఫ్యాన్‌కు ఉరేసుకుని పోలీసు అధికారి భార్య ఆత్మహత్య

ఫ్యాన్‌కు ఉరేసుకుని పోలీసు అధికారి భార్య ఆత్మహత్య

దీర్ఘకాలిక వ్యాధి సోకిందన్న ఆందోళనతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఆమె స్నేహితురాలు ఇంటికొచ్చి చూడగా సునీత ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

ఫ్యాన్‌కు ఉరేసుకుని పోలీసు అధికారి భార్య ఆత్మహత్య

ఫ్యాన్‌కు ఉరేసుకుని పోలీసు అధికారి భార్య ఆత్మహత్య

వెంటనే ఆమె విషయాన్ని సునీత భర్త టూటౌన్ సిఐ పి. రమణకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.

ఫ్యాన్‌కు ఉరేసుకుని పోలీసు అధికారి భార్య ఆత్మహత్య

ఫ్యాన్‌కు ఉరేసుకుని పోలీసు అధికారి భార్య ఆత్మహత్య

హూటాహుటిన ఆయన చేరుకొని కొన ఊపిరితో ఉన్న తన భార్యను కేర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందడంతో మూడో పట్టణ సీఐ బెండి వెంకటరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

 ఫ్యాన్‌కు ఉరేసుకుని పోలీసు అధికారి భార్య ఆత్మహత్య

ఫ్యాన్‌కు ఉరేసుకుని పోలీసు అధికారి భార్య ఆత్మహత్య

కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఇది ఇలా ఉంటే సిఐ రమణకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు చెన్నైలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. చిన్న కొడుకు విశాఖపట్నంలోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+