కేరళ నుంచి వచ్చిన మహిళా డాక్టర్, తిరుపతిలో నిపా వైరస్ కలకలం, చంద్రబాబు ఆరా
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో నిపా వైరస్ కలకలం చెలరేగింది. కేరళ నుంచి వచ్చిన ఓ భక్తురాలికి నిపా ఉందనే అనుమానంతో ఆమెను అబ్జర్వేషన్లో ఉంచారు. ఆమె డాక్టర్ కూడా. ఆమె రుయా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షలో ఉన్నారు. నిపా వైరస్ కారణంగా కేరళలో పలువురు మరణించిన విషయం తెలిసిందే.
తొలుత గబ్బిలాలు, పందుల కారణంగా ఈ వైరస్ వ్యాప్తిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించినప్పటికీ, ఆపై వైరస్ వ్యాప్తికి అదొక్కటే కారణం కాదని, కలుషిత నీరు కూడా కారణమవుతోందని తేల్చారని తెలుస్తోంది. జ్వరం, తలనొప్పి, విరోజనాలు వంటి సమస్యతో బాధపడుతూ ఐదారు రోజులైనా తగ్గకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

బాధితురాలిని పరామర్శించిన కలెక్టర్, చంద్రబాబు ఆరా
రుయా ఆసుపత్రిలో ఉన్న బాధిత వైద్యురాలిని కలెక్టర్ పరామర్శించారు. వైద్య పరీక్షల అనంతరం మహిళా వైద్యురాలికి నిపా వైరస్ లేదని వైద్యులు తేల్చారు. కేరళ ప్రభుత్వం సూచన మేరకే ఆమెను ఐదు రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు నిపా కేసు నమోదు కాలేదన్నారు.
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. నిపా వైరస్ పైన చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. తిరుపతిలో నిపా వైరస్ వదంతులపై చంద్రబాబా ఆరా తీశారు. దీనిపై నిజాలు వెల్లడించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నిపా వైరస్ అనేది కేవలం వదంతులేనని కలెక్టర్ సీఎంకు నిధులు ఇచ్చారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications