చీమలు పట్టి: లేడీ డాక్టర్ అనుమానాస్పద మృతి

ఉదయం లేచి చూసేసరికి నవ్య మరణించి ఉందని, ఆత్మహత్య చేసుకుందని భర్త మనోజ్ కుమార్ చెబుతున్నాడు. మృతదేహానికి చీమలు పట్టి ఉండడం, మరణించిన విషయం ఆలస్యంగా చెప్పడం వంటి కారణాలతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వైద్యురాలు మరణించడానికి గల కారణం తెలియాల్సి ఉంది. మనోజ్ కుమార్, నవ్య పట్టణంలో సొంత ఆస్పత్రి నడుపుతున్నారు. వీరికి 9 నెలల పాప ఉంది. నవ్య తండ్రి డాక్టర్ రాంబాబు మంచిర్యాలలో ప్రముఖ రేడియోలజిస్టు. మృతదేహాన్ని తండ్రి రేడియాలజీ ఆస్పత్రి వద్ద ఉంచారు.
నవ్య శేషు సోదరుడు విదేశాల నుంచి వచ్చిన తర్వాత కేసు గురించి మాట్లాడుతానని రాంబాబు పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications