యువతిని అశ్లీలంగా చిత్రీకరించి భర్త కామవాంఛకు భార్య సహకారం
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మహిళ అత్యంత నీచమైన కార్యానికి ఒడిగంట్టింది. భర్త కామవాంఛకు మరో మహిళను బలి చేయడానికి సిద్ధపడింది. ఓ యువతిని అశ్లీలంగా చిత్రీకరించి ఆ మహిళ తన భర్త కామవాంఛలు తీర్చుకోవడానికి సహకరించింది.
దానికితోడు వ్యభిచారం చేయాలని ఆ మహిళపై భార్యాభర్తలిద్దరు ఒత్తిడి పెట్టారు. అత్యంత నీచమైన ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో గురువారంనాడు వెలుగు చూసింది. పాలకొల్లు సిఐ ఎ. చంద్రశేఖర్ అందుకు సంబంధించిన వివరాలను అందించారు

ఆచంట పంచాయతీ పరిధిలోని కొత్తూరు ప్రాంతానికి చెందిన దంపతులు నెక్కంటి శ్రీనివాస్, సుశీల ఇంటికి అదే ప్రాంతానికి చెందిన డిగ్రీ చదువుతున్న ఓ యువతి వస్తుండేది. నిరుడు మే 1వ తేదీ సాయంత్రం ఆ యువతి శ్రీను ఇంటికి వెళ్లింది. శ్రీను దంపతులు పథకం ప్రకారం ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు.
అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతితో భర్త అశ్లీలంగా వ్యవహరించిన తీరును స్వయంగా భార్యే సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది. అప్పటి నుంచి వారిద్దరూ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.












Click it and Unblock the Notifications