వివాహిత దారుణ హత్య: గదిలో కండోమ్స్, కళ్యాణి మిస్టరీ డెత్!

Subscribe to Oneindia Telugu
  వివాహిత దారుణ హత్య: గదిలో కండోమ్స్ Woman was lost life in her own house | Oneindia Telugu

  విజయవాడ: కృష్ణా జిల్లా రామవరప్పాడులో ఓ ఒంటరి మహిళ దారుణ హత్యకు గురైంది. ఏడాది క్రితం భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న ఆమె వడ్డీ వ్యాపారం నిర్వహిస్తోంది.

  ఈ నేపథ్యంలో డబ్బు కోసమే ఆమెను హత్య చేసి ఉంటారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మంగళవారం ఆమె ఉంటున్న ఇంటి పోర్షన్ లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో.. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి లోపలికి వెళ్లి చూసిన పోలీసులకు బెడ్ పై మహిళ మృతదేహం కనిపించింది.

   ఎవరా మహిళ?:

  ఎవరా మహిళ?:

  ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన పువ్వాడ కల్యాణి (35) భర్త ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటినుంచి రామవరప్పాడుకు వచ్చి అక్కడే ఉంటోంది. భర్త మృతితో వచ్చిన నష్టపరిహారంతో స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

   మిస్టరీ:

  మిస్టరీ:

  ఒంటరిగా ఉంటున్న కళ్యాణిని ఎవరు హత్య చేశారన్నది మిస్టరీగా మారింది. కళ్యాణి వద్ద నగదు, నగలు ఉంటాయని తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కళ్యాణి వద్దక తరుచు వచ్చిపోయేవారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

   కండోమ్‌లు, మద్యం సీసాలు:

  కండోమ్‌లు, మద్యం సీసాలు:

  కళ్యాణి హత్యకు గురైన గదిలో కండోమ్ లు, ఖాళీ మద్యం సీసాలు దొరకడాన్ని బట్టి.. ఆమెకు వివాహేతర సంబంధాలేమైనా ఉన్నాయా? అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఆమె మృతదేహం ఉన్న గదిలోనే.. ఒక మూలన 5 కండోమ్ లు, ఖాళీ మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. ఒక కండోమ్ వాడినట్లుగా గుర్తించారు.

  ఆభరణాలు, వాహనం మాయం:

  ఆభరణాలు, వాహనం మాయం:

  హత్యకు గురైన కల్యాణి మెడలో ఉండాల్సిన బంగారు ఆభరణాలు, ఇంటి ఆవరణలో ఉండాల్సిన వాహనం మాయమవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలిసినవారే కళ్యాణిని చంపేసి ఉంటారా? లేక దుండగుల పనా? అన్నది అంతుచిక్కడం లేదు.

  పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌‌ను రంగంలోకి దింపడంతో మహిళ హత్యకు గురైన గదిలో కొద్ది సేపు కలియతిరిగి కొల్లా వారి వీధి వరకూ వెళ్లి ఆగిపోయాయి. మరోవైపు క్లూస్‌ టీం సంఘటనా స్థలంలో పడి ఉన్న సామాన్ల వద్ద వేలిముద్రలు సేకరించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A 35-years-old woman was brutally murdered in her house, police found her dead body on Tuesday

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి