మహిళపై నలుగురు గ్యాంగ్ రేప్: లేడీ టీచర్‌పై కత్తితో దాడి

అనంతపురం/ తిరుపతి/ గుంటూరు: అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నాగప్ప కాలనీలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. జరిగింది. నలుగురు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే, అనంతపురం జిల్లాలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. అనంతపురం రూరల్ మండలం సోమలదొడ్డి దగ్గర హైవేపై ఓ ఉపాధ్యాయురాలిపై కత్తితో దాడి చేశారు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగలు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థిని ఆత్మహత్య

Woman gang raped in Ananthapur district by youth

తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్శిటీ భవనంపై నుంచి దూకి చనిపోయింది. మృతురాలు హోంసైన్స్ విద్యార్థిని ఇందూషాగా గుర్తించారు. మహిళా వర్సిటీ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హిందూషా చిన్నప్పటి నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి భోజనం చేసిన తర్వాత కాలేజీ భవనంపైకి ఎక్కి అమాంతం దూకేసింది. ఇది గమనించిన తోటి విద్యార్తులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె మార్గమధ్యలోనే మరణించింది.

అనుమానాస్పద స్థితిలో తల్లీకొడుకుల మృతి

గుంటూరు జిల్లా నర్సారావుపేట మండలం రామిరెడ్డిపేటలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత తల్లీకొడుకులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. సిరిగిరి విజయలక్ష్మి (67), ఆమె కుమారుడు గురుప్రసాద్ (35) గత పది రోజులుగా కాలనీలోని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు.

శుక్రవారం ఉదయం వారు ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచి చూశారు. వారి శవాలు ఇంట్లో పడి ఉన్నాయి. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. గురుప్రసాద్‌కు మతిస్థిమితం లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+