మత్తు మందు ఇచ్చి యువతిపై గ్యాంగ్ రేప్?
నిజామాబాద్: జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 17ఏళ్ల యువతి అనుమానస్పదంగా సంచరిస్తుండగా నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు జార్ఖండ్ నుండి యువతిని తీసుకువచ్చి ఇక్కడ ఆమెకు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం ఆ యువతి మాట్లాడలేని పరిస్థితిలో ఉందని, వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టినట్లు మాక్లూర్ పోలీసులు తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 17ఏళ్ల యువతి గత నెల 28వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లింది.

రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు జార్ఖండ్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాగా 29వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే అక్కడ తప్పిపోయిన యువతి అనూహ్యంగా ఆదివారం మాక్లూర్ మండలంలోని దాస్‌నగర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు మాక్లూర్ పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో మాక్లూర్ ఎస్‌ఐ సంతోష్‌కుమార్ అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించి ఆసుపత్రికి తరలించారు. ఆ యువతిని జార్ఖండ్‌కు చెందిన యువకులు నిజామాబాద్‌కు నమ్మించి తీసుకొచ్చి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications