విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళ దొంగను పట్టించిన కాగితం ముక్క (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నమ్మకంగా ఉంటూ ఇంటికి కన్నం వేసిన నిందితురాలిని కంచరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐతే ఈ చోరీకి ఉపయోగించిన చిన్న కాగితం ముక్కే ఆమెను పట్టించడం విశేషం. సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నగర క్రైమ్ ఏడీసీపీ ఎస్. వరదరాజులు మాట్లాడుతూ మర్రిపాలెం ఉడా లేఅవుట్‌లోని దేవి టవర్స్ లో నివసిస్తోన్న బొబ్బిలి రాధ సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.

చెన్నైలో నివసిస్తున్న తమ బంధువుల ఇంటికి తల్లితో కలసి గత నెల 25న రాధ వెళ్లారు. ప్రయాణమయ్యే సమయంలో ఇంటికి ఎదురుగా నమ్మకంగా ఉంటున్న వి. కల్పన అనే మహిళకు ఇంటి తాళాలు అప్పగించారు. ఐతే రాధ చెన్నై వెళ్లిన రోజు రాత్రే ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను కల్పన చోరీ చేసి, ఎవరో దొంగలు ఇంట్లో చొరబడ్డారని అందరినీ నమ్మించింది.

పోలీసులు అదుపులోకి నిందితుడు

పోలీసులు అదుపులోకి నిందితుడు


పగటిపూట రెక్కీ నిర్వహించి, రాత్రివేళ ఇళ్లల్లో చోరీలు చేస్తు్నన నిందితున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఏడీసీపీ వరదరాజులు తెలియజేశారు.

పోలీసులు అదుపులోకి నిందితుడు

పోలీసులు అదుపులోకి నిందితుడు

నగరంలో మధురవాడ, వాంబే కాలనీలో నివసిస్తున్న నిందితుడు మహ్మద్ సోను నాలుగు చోరీలు చేశాడని వివరించారు. అతని వయసు 25 ఏళ్లు.

 పోలీసులు అదుపులోకి నిందితుడు

పోలీసులు అదుపులోకి నిందితుడు


నాలుగు చోరీలకు గాను 52 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. గతంలో ఎనిమిది కేసుల్లో జైలు జీవితం అనుభవించిన పాత నేరస్తుడని అన్నారు.

పోలీసులు అదుపులోకి నిందితుడు

పోలీసులు అదుపులోకి నిందితుడు

నగరంలో మధురవాడ, వాంబే కాలనీలో నివసిస్తున్న నిందితుడు మహ్మద్ సోను. అతని వయసు 25 ఏళ్లు.

పోలీసులు అదుపులోకి నిందితుడు

పోలీసులు అదుపులోకి నిందితుడు

నాలుగు చోరీలకు గాను 52 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

తాను దొంగిలించిన కొన్ని బంగారు ఆభరణాలు ఎదురింటిలో ఉంటున్న మరో వ్యక్తి ద్విచక్ర వాహనంలో ఓ కాగితంలో చుట్టి పెట్టింది. విషయం తెలుసుకున్న రాధ నగరానికి చేరుకోని తన ఇంట్లో దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు తమ దర్వాప్తులో మరి కొన్ని నిజాలను తెలుసుకున్నారు.

ఎదురింటి వ్యక్తి వాహనంలో బంగారు ఆభరణాలు చుట్టిపెట్టిన కాగితాన్ని పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఆ కాగితం ఆధారంగా చుట్టుప్రక్కల ఇళ్లలో తనిఖీలు చేయగా... ఆ కాగితానికి సంబంధించిన మిగతా భాగం కల్పన ఇంటిలోని కప్ బోర్డులో దొరకడంతో ఈ కేసు చిక్కుముడి వీడిపోయింది.

దొంగతనం చేసింది కల్సనేనని పోలీసులు నిర్దారణకు వచ్చి ఆమెపై కేసు నమోదు చేశామని అన్నారు. నిందితురాలి నుంచి 92 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

English summary
A woman who was allegedly involved in burglaries was arrested and gold ornaments valued at Rs.1 lakh were recovered from her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X