భార్యను చంపి సముద్రతీరంలో పాతిపెట్టిన భర్త

కాకినాడ/ విజయవాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలోని దుమ్ములపేటలో మేరీ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. భార్యను తానే హత్యచేసినట్టు విచారణలో భర్త తాతారావు అంగీకరించాడు. భర్త మేరీని హతమార్చి సముద్రతీరంలో పాతిపెట్టినట్టు చెప్పారు.

తమ కూతురు కనిపించడం లేదని నెల రోజుల క్రితం మేరీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెలరోజుల క్రితం అదృశ్యమైన మేరీ ఉదంతం విషాదాంతంగా మారింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే అతను భార్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Woman killed by husband at Kakinada

దొంగ బంగారం కేసులో నిందితుడి మృతి

దొంగ బంగారం కేసులో నిందితుడైన వినోద్ విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు.ఈ నెల 19న వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ బిల్డింగ్‌పై నుంచి వినోద్ దూకారు. దొంగలు తెచ్చిన బంగారాన్నికొనుగోలు చేసిన కేసులో వినోద్‌ నిందితుడు.విచారణ నిమిత్తం వినోద్‌ను రాజమండ్రి నుంచి విజయవాడకు తీసుకురాగా ఈ ఉదంతం జరిగింది.

బ్యాంక్ చోరీకి విఫలయత్నం

పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు ఆంధ్రా బ్యాంక్‌ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం తెరుచుకోకపోవడంతో దుండగుల పరారయ్యారు. పోలీసులు వచ్చి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+