నిమ్మరసంతో ముగ్గురు మహిళలను చంపేందుకు యత్నం: ఒకరి మృతి

కడప: అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ముగ్గురు మహిళలకు ఓ మహిళ విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించింది. ఈ సంఘటనలో ఓ మహిళ మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఆ సంఘటన కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఇప్పెంట పంచాయతీ పరిధిలోని జె. కొత్తపల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన హుజ్జమ్మ అనే మహిళ అదే గ్రామానికి చెందిన పఠాన్ నజీబు వద్ద కొంత సొమ్ము అప్పుగా తీసుకుంది.

Woman planned kill three ladies in Kadapa district

గత కొద్ది రోజులుగా అడుగుతున్నా అప్పు తీర్చడం లేదు. ఈ క్రమంలో సోమవారంనాడు ఫరీదాబాను, మహెబూబ్ జాన్‌లతో కలిసి పఠాన్ నజీబు హుజ్జమ్మ ఇంటికి వెళ్లి అప్పుడు డబ్బులు అడిగింది. దీంతో హుజ్జమ్మ తన వద్ద ప్రస్తుతానికి డబ్బులు లేవని త్వరలో ఇచ్చేస్తానని చెప్పి వారికి నిమ్మకాయ రసం ఇచ్చింది.

ఆ నిమ్మరసం తాగి ఇంటికి వచ్చిన తర్వ్తాత ముగ్గురు మహిళలు అనారోగ్యానికి గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా పఠాన్ నజీబు మరణించింది. మిగతా ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+