మహిళపై అత్యాచారం, హత్య: చంద్రబాబు సీరియస్

మృతదేహాన్ని ఎవ్వరికీ తెలియకుండా నిప్పు అంటించాలన్న ఉద్దేశ్యంతో ద్విచక్ర వాహనం పైన తీసుకు వెళ్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కంటపడ్డారు. దీంతో పోలీసులు వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
కాగా, అనంతపురంలో మహిళపై అత్యాచారం, హత్య ఘటన పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల పైన నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డీజీపీని చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
నిందితుల అరెస్ట్
అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితులు బెస్త సురేష్, ఆవుల నాగేంద్రలను పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు.












Click it and Unblock the Notifications