వీడిన మిస్టరీ: మహిళతో కలిసి కల్లు తాగి, గ్యాంగ్ రేప్ చేసి, హత్య చేశారు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గండి హన్మాన్ సమీపంలో జాతీయ రహదారి పక్కన నిర్మాణంలో ఉన్న ఆశ్రమంలో లభ్యమైన గుర్తు తెలియని మహిళ మృతి మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ మహిళను నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్‌కు చెందిన దండుగుల లక్ష్మి(38)గా గుర్తించారు. ఆమెపై సామూహిక లైంగిక దాడి చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో నిందితులైన దండుగు రాజన్న (38), షడ్మాక గంగారాం (45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. అనంతరం జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. లక్ష్మి తాగుడుకు బానిసైంది.
భర్త వెంకటస్వామితో విభేదించి ఈ నెల 15న ఉదయం చిట్టాపూర్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరి మెట్‌పల్లికి చేరుకుంది. అదే రోజు సాయంత్రం మెట్‌పల్లి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని కల్లు దుకాణం వద్ద ఆమెకు దండుగుల రాజు, షడ్మాక గంగారాం పరిచయమయ్యారు. ముగ్గురు కలిసి కల్లు తాగారు.

తర్వాత ఆమెను నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో గల బంధువుల ఇంట్లో దింపుతామని నమ్మించి బస్టాండ్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న ఆటోలో ఎక్కించుకుని మార్గమధ్యలోని గండి హన్మాన్ ఆలయం దగ్గర దింపారు. స్వామి వారి దర్శనం తర్వా త భోజనానికి వెళ్దామని సమీపంలో ఉన్న సుందర చైతన్య ఆశ్రమంలోకి తీసుకెళ్లారు.
వీరిలో షడ్మాక గంగారాం అదే ఆశ్రమంలో గతంలో సెంట్రింగ్, ఫె న్సింగ్ మేస్త్రీగా పని చేశాడు. ఆశ్రమంలోకి వెళ్లిన తర్వా త అంతా చీకటిగా ఉండడంతో అనుమానం వచ్చిన లక్ష్మి పారిపోయేందుకు యత్నించింది. ఆమెను రాజ న్న, గంగారాం కలిసి పట్టుకొని నిర్మాణంలో ఉన్న భవనం గదిలోకి ఎత్తుకెళ్లి లైంగిక దాడి చేశారు.
విషయం కమ్మర్‌పల్లి పోలీసులకు చెప్తానంటూ లక్ష్మి హెచ్చరించింది. దీంతో గంగారాం, రాజన్న కలిసి ఆశ్రమం ఆవరణలో ఉన్న సెంట్రింగ్ కర్రను తీసుకొని ఆమె ముఖంపై, గొంతుపై బాదారు. తర్వాత చీర కొంగును మెడకు చుట్టి హత్య చేసి పరారయ్యారు.
ఘటనా స్థలంలో దొరికిన ఆనవాళ్ల ఆధారంగా మెట్‌పల్లి సీఐ రాజశేఖర్‌రాజు పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో మధ్యాహ్నం మెట్‌పల్లి మండలం వెంకట్రావుపేట శివారులోని మల్లన్న ఆలయం సమీపంలో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు.












Click it and Unblock the Notifications