కారుతో ఉడాయించిన లేడీకి జైలు: బాబా అరెస్టు

Woman sentenced for stealing car
హైదరాబాద్: కారు యజమానిని లిఫ్ట్ అడిగి, ఆ కారుతో పాటు ఉడాయించిన మహిళకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి 9ఎంఎం కోర్టు న్యాయమూర్తి వి. సత్యనారాయణ ఆరు నెలల జైలు శిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కథనం ప్రకారం - హర్యానాకు చెందిన మమత రాణి అలియాస్ మేఘన నాలుగు నెలల క్రితం మాదాపూర్‌లో కారులో వెళ్తున్న జి. వెంకట్ రెడ్డిని లిఫ్ట్ అడిగి కారు ఎక్కింది.

కొద్ది దూరం వెళ్లిన తర్వాత వెంకట్ రెడ్డి ఓ హోటల్ వద్ద కారు ఆపి లోపలికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి అతని కారును తీసుకుని మమత ఉడాయించింది. వెంకట్ రెడ్డి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు నిందితురాలిని గత మే 20వ తేదీన అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి మమతకు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఆమెపై ఇలాంటివే మరో రెండు కేసులు కూడా ఉన్నాయి.

ఇదిలావుంటే, కష్టాలు తొలగిస్తానని మహిళలకు మాయమాటలు చెప్పి పూజ పేరుతో బంగారు నగలను దోచుకునే స్వామిజీని పోలీసులు అదుపులోకి తీసుకొని 8తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ బి.రమేశ్, ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డి వివరాలను తెలిపారు. కడప జిల్లా మైదుకూరు మండలం ఇంద్రమ్మ కాలనీకు చెందిన సప్పిడి కళ్యాణ్‌రాజు (30) తన భార్య వెంకటమ్మ, అక్క ఏసురత్నంతో కలిసి పథకం ప్రకారం బస్తీలను ఎంచుకొని ఇంటింటికి తిరిగి ఇంటి సమస్యలు, గండాలు, దోషాలు, వివరాలను పిల్లలద్వారా వివరాలు సేకరిస్తారు.

అనంతరం కళ్యాణ్‌రాజు స్వామిజీ వేషం వేసుకొని టార్గెట్ చేసిన ఇంటి వద్ద మహిళలను మీరు సమస్యలతోపాటు మీ పిల్లలపై మరణ గండం ఉందని మాయమాటలు చెప్పి తన వలలో వేసుకొన్న తర్వాత ఇంట్లో పూజలునిర్వహిస్తే గండం తొలిగిపోతుందని చెప్పి పూజల కోసం బంగారు ఆభరణాలు అవసరమని చెప్పి ఓ డబ్బాలో బంగారు నగలు వేసి పూజ నిర్వహిస్తాడు.

అనంతరం ఆ మహిళను స్నానం చేసి రావాలి అని చెప్పి స్నానం కోసం వెళ్ళివచ్చేసరికి ఆ బంగారు డబ్బా మార్చి మరో డబ్బా పెట్టి మోసం చేసేవాడు. ఈనెల 7వ తేదీన బాబుల్‌రెడ్డినగర్‌కు చెందిన లక్ష్మీని మోస చేసి 15 తులాల బంగారు నగలతో పారిపోయాడు. తుక్కుగూడలో ఓ ఇంట్లో మోసం చేస్తుండగా స్థానికులు పట్టుకొని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+