సహజీవనంలో కలహాలు : కత్తితో దాడిచేసి పరారైన మహిళ, ఆస్పత్రికి తరలింపు
తిరువూరు : భార్యభర్తల మధ్యే కాదు .. సహజీవనంలోనూ కలహాలు వస్తోంటాయి. కలిసి ఉంటున్నాం కదా అని .. గొడవ పడకుండా ఉండలేరు. ఆ గొడవలు ఏ స్థాయికి వెళతాయంటే కత్తితో దాడి చేసే వరకు దారితీస్తాయి. కృష్ణా జిల్లా తిరువూరులో శ్రీనివాసరావుపై మహిళ దాడి చేసి పరారవడం కలకలం రేపింది.

ప్రియుడిపైనే దాడి ..
తిరువూరుకి చెందిన శ్రీనివాసరావు బైపాస్ రోడ్డులో టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు. మణి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే వీరి మధ్య గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ కూడా మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో కోపగించుకున్న మణి .. కొబ్బరిబోండాలు నరికే కత్తితో శ్రీనివాస్‌పై దాడిచేసి .. పరారైంది.
ఆస్పత్రికి తరలింపు
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బెడ్ రూంలో అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్ ను ప్రాంతీయ హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రాథమిక చికిత్స చేసి .. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని .. నిందితురాలి కోసం గాలిస్తున్నట్టు ఎస్పై మణికుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications