గోవిందా గోవిందా: టీటీడీతో టీసీఎస్ ఒప్పందం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కలిసి ఒప్పందం కుదుర్చుకుంది.

తిరుమల: పెద్ద నోట్లు రద్దు చేస్తూ నల్లకుబేరులకు ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద షాక్ ఇవ్వడంతో ప్రస్తుతం దేవాలయాలు నగదు రహిత సిస్టమ్స్ లోకి మారిపోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆ కోవలోకి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేరిపోయింది.

ప్రపంచంలోనే అత్యంత ధనికమైన ఆలయంగా గుర్తింపు తెచ్చుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కలిసి ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంలో భాగంగా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయానికి విచ్చేసిన సందర్శకులకు అవసరమైన అన్ని రకాల ఈ-సేవలు టీసీఎస్ ద్వారా టీటీడీ అందించనుంది. అదే విధంగా దేవాలయానికి అవసరమైన టెక్నికల్ సపోర్టును టీసీఎస్ అందించనుంది.

World’s richest temple TTD turns to TCS to tide over demonetisation drive

టీటీడీ-టీసీఎస్ చేసుకున్న కీలకమైన ఒప్పందాలు ఇవే. ఈ-డోనేషన్, ఈ-హుండీ, ఈ- పబ్లికేషన్స్, ఈ-చలాన్, ఈ-దర్శన్, ఈ-వసతి, ఈ-సేవ తదితర సేవలను యాత్రికులకు టీసీఎస్ సహకారంతో అందిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.

కొన్ని సంప్రాదాయ సేవల కోసం తర్వాతి తరం టెక్నాలజీతో అప్లికేషన్స్ అభివృద్ది చెయ్యడానికి సిద్దం అయ్యామని టీటీడీ మేనేజ్ మెంట్ బోర్డు తెలిపింది. రోజువారి కార్యకలాపాలు సులభతరం చెయ్యడానికి ఈ ఒప్పందం సహకరిస్తుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యతలో ఓ భాగంగా ఉన్న టీసీఎస్ సైతం తాము టీటీడీతో కలిసి పని చేస్తున్నట్లు పెర్కొంది. శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి తాము కొత్త ఆన్ లైన్ వెబ్ పోర్టల్ ద్వారా స్వామి వారి సేవ, దర్శన్, డోనార్ మేనేజ్ మెంట్ సిస్టమ్, ఆలయ నిర్వహణ సిస్టమ్ అందిస్తున్నామని టీసీఎస్ అధికార ప్రతినిధులు తెలిపారు.

పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత దేవాలయాలు కాసులతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ దేవాలయాల హుండీల్లో కానుకలు విపరీతంగా సమర్పించుకుంటున్నారు.

World’s richest temple TTD turns to TCS to tide over demonetisation drive

ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతి ఏడాది దాదాపు రూ. 1,100 కోట్ల డొనేషన్లు వస్తుంటాయి. ప్రతి రోజు రూ. 3 కోట్లతో హుండీ నిండిపోతుంటుంది.

ఇప్పుడు పెద్ద నోట్లు రద్దు తరువాత శ్రీవారి హుండీ ఆదాయం పెరిగిపోయిందని, గత వారం నుంచి ప్రతి రోజు సరాసరి రూ. 4.2 కోట్లు హుండీ ఆదాయం వస్తుందని అధికారులు తెలిపారు. వాటిలో రూ. 1,000, రూ. 500 నోట్లు ఉన్నాయి. అయితే ఈ పెద్దనోట్లు లెక్కల్లో చూపించిందో, చూపించనిదో చెప్పడం చాల కష్టం అని అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+