సోషల్ మీడియాలో రోజాపై తప్పుడు ప్రచారం: చర్యకు రె'ఢీ'
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సామాజిక మాథ్యమాల్లో తప్పుడు ప్రచారం సాగుతోంది. ఆమె చనిపోయిందంటూ మార్పింగ్‌ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయమై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చట్టపరమైన చర్యలు చ
అమరావతి:వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సామాజిక మాథ్యమాల్లో తప్పుడు ప్రచారం సాగుతోంది. ఆమె చనిపోయిందంటూ మార్పింగ్‌ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయమై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చట్టపరమైన చర్యలు చేయనున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు.

తన రాజకీయ శత్రువులే ఈ రకమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. తాను మరణించినట్టు ఫోటోలు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు రోజా చెప్పారు.
అసెంబ్లీలో తాను దీక్ష సమయంలో ఆసుపత్రిలో ఉన్న పోటోలను మార్పింగ్ చేశారని రోజా అభిప్రాయడ్డారు. ఈ రకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నవారెవరో అర్ధం కావడం లేదన్నారు.
ఈ ఘటనకు బాధ్యలు ఎవరైనా కఠినంగా శిక్షించాలని కోరనున్నట్టు ఆమె చెప్పారు. రాజకీయాల్లో ఉన్నవారిపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications