కేంద్ర బడ్డెట్ 2018: ఎపి కోర్కెల చిట్టా విప్పిన యనమల
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రతిపాదించే కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రానికి అవసరమైన కోర్కెల చిట్టాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ముందు పెట్టారు.
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. గురువారం అరుణ్ జైట్లీ అధ్యక్షతన వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో ప్రీ బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యనమల హాజరయ్యారు.

రాష్ట్ర విభజన తర్వాత తలెత్తిన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు వచ్చే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కోరినట్లు సమావేశానంతరం యనమల రామకృష్ణుడు మీడియా ప్రతినిధులతో చెప్పారు.
రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఈ బడ్జెట్‌లో ప్రకటించాలని కూడా కోరినట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో దాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు యువజన విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రాధాన్యం ఇచ్చేలా నిధుల కేటాయింపు జరగాలని న అన్నారు.
వెనుకబడిన కులాలవారిని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు వచ్చే బడ్జెట్‌లో చర్యలు చేపట్టాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications