మొండి వైఖరి చూస్తున్నారు: యనమల, జగన్ తప్పులో కాలేస్తున్నారా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరిని ప్రజలే అర్థం చేసుకుంటున్నారని ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం నాడు చెప్పారు. నిబంధనల ప్రకారం సభలో ఎవరైనా మాట్లాడవచ్చునని చెప్పారు.
అయితే, ఇతరుల హక్కులకు భంగం కలిగేలా మాట్లాడవద్దన్నారు. సభాపతి పైన వైసిపి అవిశ్వాసం పెడితే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాగా, సోమవారం జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టిడిపి, బిజెపి సభ్యులు జగన్ పైన విరుచుకుపడిన విషయం తెలిసిందే.
కొద్ది రోజుల క్రితం రాజధాని భూముల అక్రమాలు అంటూ మంత్రుల పైన, సోమవారం అవిశ్వాసంపై చర్చ సందర్భంగా చంద్రబాబు వేటినైనా మేనేజ్ చేయగలరని వ్యాఖ్యానించడాన్ని బిజెపి, టిడిపి సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై సభ్యులు మాట్లాడుతూ.. జగన్ తెలిసో తెలియకో చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు.

పోలవరం పూర్తి చేస్తాం: దేవినేని
పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి తప్పకుండా పూర్తి చేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు.
కరవు సీమ రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు.
గాలేరు-నగరి సుజల స్రవంతిలో అవినీతి చోటుచేసుకుందని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేసిన ఆరోపణలను దేవినేని ఖండించారు. సాగు నీటి ప్రాజెక్టుల్లో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలు పూక్తిగా అవాస్తవమని చెప్పారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి చూపిస్తామన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 8.8 టీఎంసీల నీటిని నిల్వ చేయడం ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పంటలను కాపాడామన్నారు. పట్టిసీమ కన్నా డబుల్ స్పీడుతో గాలేరు-నగరి ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేసి కడప జిల్లాను సాగు నీటి కష్టాల్లో నుంచి బయట పడేస్తామన్నారు.












Click it and Unblock the Notifications