సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌యోగం చేయ‌బోతున్న టీడీపీ సీనియ‌ర్ నేత‌?

తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌త్యేక కోవ‌కు చెందుతారు. 26 సంవ‌త్స‌రాల పాటు తుని నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించిన య‌న‌మ‌ల 2009లో ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో త‌న త‌మ్ముడు య‌న‌మ‌ల కృష్ణుణ్ని నిల‌బెట్టిన‌ప్ప‌టికీ ఫలితం ద‌క్క‌డంలేదు. 2014లో పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎమ్మెల్సీ అయిన య‌న‌మ‌ల ఆర్థిక‌శాఖ ప‌ద‌విని చేప‌ట్టారు. 2019లో తిరిగి పార్టీ ఓట‌మి పాలైంది. తుని నుంచి ఆయ‌న త‌మ్ముడు కూడా ఓట‌మిపాల‌య్యారు.

అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న యనమల

అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న యనమల


దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేడి రాజుకుంటున్న త‌రుణంలో రాజ‌కీయంగా చురుగ్గా వ్య‌వ‌హ‌రించిన తెలుగుదేశం పార్టీ నేత‌లంతా మ‌రోసారి త‌మ అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. తుని నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈసారి ఎన్నిక‌ల్లో త‌న‌కు బ‌దులుగా త‌న కుమార్తె దివ్య‌ను బ‌రిలోకి దింపాల‌ని య‌న‌మ‌ల భావిస్తున్నారు. పార్టీలోని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌నే స్వ‌యంగా ఫోన్ చేసి విష‌యం చెబుతుండటంతోపాటు పోటీచేస్తే ఎలాగుంటుంది? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

తండ్రి మాట కాదనలేక పోటీకి సద్ధమవతున్న దివ్య

తండ్రి మాట కాదనలేక పోటీకి సద్ధమవతున్న దివ్య


తుని నుంచి అధికార పార్టీ త‌ర‌ఫు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగా ఉన్న దాడిశెట్టి రాజాకు త‌న కుమార్తె అయితేనే బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి అవుతారని భావిస్తున్నారు. దివ్య భ‌ర్త ఐఆర్ఎస్ అధికారి. వాస్త‌వానికి ఆమెకు రాజ‌కీయాల‌పై అంత ఆసక్తి లేన‌ప్ప‌టికీ తండ్రి మాట కాద‌న‌లేక పోటీచేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు 13 సంవ‌త్స‌రాల నుంచి దూరంగా ఉన్న య‌న‌మ‌ల ఒక్క‌సారిగా పార్టీ నాయ‌కులంద‌రికీ ఫోన్లు చేస్తుండ‌టం కూడా విస్మయానికి గురిచేస్తుంది. ఫోన్ లోనే నాయ‌కుల నుంచి త‌న కుమార్తె గెలుపుకోసం ఆయ‌న హామీ తీసుకుంటున్న‌ట్లు సమాచారం.

Recommended Video

    Title : Chandrababu Naidu About పింగళి వెంకయ్య, పివి నరసింహారావు *AndhraPradesh
    రాజకీయ సమీకరణాల ప్రస్తావ

    రాజకీయ సమీకరణాల ప్రస్తావ


    1983 నుంచి 2004 ఎన్నిక‌ల వ‌ర‌కు వ‌రుస‌గా గెలియ‌న యన‌మల రామ‌కృష్ణుడు బ‌లం ఒక‌సారి చూపిద్దామ‌ని, పెద్ద‌కుమార్తె దివ్య‌ను బ‌రిలోకి దింపుతున్నాన‌ని ఆయ‌న నాయకులందరికీ చెబుతున్నారు. పోటీ ఎలా ఉండ‌బోతోంది? రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలేంటి? త‌దిత‌ర విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. దివ్యను బరిలోకి దింపితే కలిసొచ్చే సమీకరణాలు, నాయకులు తదితర వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. ఎన్నిలక ప్రకటన రావడమే తరువాయి.. అధినేతను ఒప్పింది కుమార్తెను ఎన్నికల బరిలోకి దింపడానికి యనమల అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+