'జగన్‌కు ముందే తెలుసు, అదో ఎత్తుగడ మాత్రమే': పాదయాత్రకు అనుమతి ట్విస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జగన్ పాదయాత్ర, వైసిపి అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించడంపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం నిప్పులు చెరిగారు.

చదవండి: బాబు రాక, క్లైమాక్స్‌కు రేవంత్ ఎపిసోడ్, టిడిపికి గుడ్‌బై! అధినేత నో చెప్తే మీడియా ఎదుటే షాక్

ఆ రెండు జగన్‌కు ముందే తెలుసు

ఆ రెండు జగన్‌కు ముందే తెలుసు

వైసిపి వైఖరి సరికాదన్నారు. జగన్‌ పాదయాత్ర, అసెంబ్లీ బహిష్కరణ రెండు కూడా ముందస్తు ఎత్తుగడలే అన్నారు. నవంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని జగన్‌కు ముందే తెలుసని, అలాగే సీబీఐ న్యాయస్థానంలో కేసుల పెండింగ్‌ గురించి కూడా తెలుసన్నారు.

ఇదీ జగన్ ఎత్తుగడ

ఇదీ జగన్ ఎత్తుగడ

ఈ రెండూ ఎగ్గొట్టేందుకే జగన్ ఈ ఎత్తుగడ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ కోర్టు విచారణకు, ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండమే కావడమే జగన్‌ ఎత్తుగడ అన్నారు.

జగన్‌కు వ్యాపారం, రాజకీయం ఆటలు

జగన్‌కు వ్యాపారం, రాజకీయం ఆటలు

జగన్‌కు వ్యాపారం ఒక ఆట, రాజకీయం ఇంకో ఆటగా మారిందని యనమల మండిపడ్డారు. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయానికి ఫిరాయింపులు సాకుగా చూపడం విడ్డూరంగా ఉందన్నారు. అది స్పీకర్‌ పరిధిలోని అంశమన్నారు. జగన్‌కు ప్రజాస్వామ్యం, చట్టసభలపై గౌరవం లేదన్నారు.

ఎన్టీఆర్‌తో జగన్‌కు పోలికా?

ఎన్టీఆర్‌తో జగన్‌కు పోలికా?

ఎన్టీఆర్‌తో జగన్‌ తనను పోల్చుకోవడం పైనా యనమల స్పందించారు. ఎన్టీఆర్‌ యుగ పురుషుడు అని, జగన్‌ ఏ1 ముద్దాయి అన్నారు. వీరిద్దరికీ దేనిలో పోలిక అన్నారు. ప్రజల కోసం పెట్టిన పార్టీ టిడిపి అయితే, పదవి కోసం పుట్టిన పార్టీ వైసిపి అన్నారు.

జగన్ అనుమతి తీసుకోవాలి

జగన్ అనుమతి తీసుకోవాలి

వైసిపి అధినేత జగన్ తన పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని మంత్రి పత్తిపాటి పుల్లారావు ట్విస్ట్ ఇచ్చారు. కాగా జగన్ పాదయాత్ర నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 180 రోజుల పాటు 3వేల కిలోమీటర్లు తిరగనున్నారు. పాదయాత్ర సమయంలో 125 బహిరంగ సభలు, ప్రత్యక్షంగా 45 లక్షల మందికి చేరువ కానున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh minister Yanamala Ramakrishnudu lashed out at YSR Congress Party chief YS Jagan for Padayatra.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి