బాబు రాక, క్లైమాక్స్‌కు రేవంత్ ఎపిసోడ్, టిడిపికి గుడ్‌బై! అధినేత నో చెప్తే మీడియా ఎదుటే షాక్
తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. శుక్రవారం లేదా ఒకటి రెండు రోజుల్లో ఆయన టిడిపికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. శుక్రవారం లేదా ఒకటి రెండు రోజుల్లో ఆయన టిడిపికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చదవండి: తెలంగాణ టిడిపి నేతలకు రేవంత్ రెడ్డి దిమ్మతిరిగే సమాధానాలు
ఏపీ సీఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలవాలని ఆయన చూస్తున్నారు.
చదవండి: ఇదే మంచిది: అప్పుడే రేవంత్ రెడ్డి రెండు కీలక ప్రతిపాదనలు, బాబు ఒకే చెప్పి ఉంటే

ఇక టిడిపికి గుడ్ బై!
ఇవాళో రేపో టిడిపికి గుడ్ బై చెప్పే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం రాజీనామా చేసి వెళ్లిపోవాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందుకోసం చంద్రబాబు అపాయింటుమెంట్ కూడా కోరారని తెలుస్తోంది.

చంద్రబాబు నో చెబితే గట్టి షాకిచ్చి రాజీనామా
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో చంద్రబాబు అపాయింటుమెంట్ ఇస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు అపాయింటుమెంట్ ఇస్తే సైలెంట్‌గా రాజీనామా చేయనున్నారు. లేదంటే మీడియా సమావేశం పెట్టి రాజీనామా చేయాలనేది రేవంత్ రెడ్డి యోచన.

టిటిడిపి నేతలతో చంద్రబాబు భేటీ
చంద్రబాబు నాయుడు శుక్రవారం వేకువజామున హైదరాబాద్ రానున్నారు. తొలుత ఆయన గవర్నర్ నరసింహన్‌ను కలుస్తారు. అనంతరం తెలంగాణ టిడిపి నేతలతో భేటీ అవుతారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై చర్చించనున్నారు. అనంతరం అమరావతి బయలదేరి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.

చంద్రబాబు నిర్ణయంపై సస్పెన్స్
హైదరాబాద్ వస్తున్న చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారనే చర్చ సాగుతోంది. ఆయన మనసులో ఏముంది? రేవంత్ రెడ్డి పైన ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనిదే సస్పెన్స్‌గా మారింది.

చంద్రబాబుకు అన్నీ చెప్పి రాజీనామా
ఇప్పటికే రేవంత్ రెడ్డిని పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. చంద్రబాబు లేని సమయం చూసి తనను పదవుల నుంచి తొలగించారని గురువారం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వచ్చే రెండు రోజులు పదవిలో ఉంటే తాను ఆస్తులు కూడబెట్టుకుంటానా అని రేవంత్ నిలదీశారు.

నాకు చంద్రబాబు చెప్పలేదు
తనను పదవుల నుంచి తొలగించినట్లు చంద్రబాబు తనకు చెప్పలేదని రేవంత్ అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసి అన్ని చెప్పాలని రేవంత్ భావిస్తున్నారు. ఆ తర్వాత టిడిపికి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications