దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

ఇదే మంచిది: అప్పుడే రేవంత్ రెడ్డి రెండు కీలక ప్రతిపాదనలు, బాబు ఒకే చెప్పి ఉంటే

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి.

  జానా రెడ్డి చెప్పిన కాంగ్రెసు బాహుబలి రేవంత్ రెడ్డేనా?

  ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉన్నారు. ఈ సమయంలో రేవంత్ అంశం టిడిపిలో వేడి రాజేస్తోంది. ఆయనను పదవుల నుంచి తొలగించాలని ఇప్పటికే టి-టిడిపి నేతలు కోరుతున్నారు.

  సొంత ఇలాకాలో 'ముందే' దెబ్బ: రేవంత్‌ని దెబ్బతీసేందుకు టిఆర్ఎస్ పక్కా స్కెచ్

  చంద్రబాబు ముందు రేవంత్ రెండు ప్రతిపాదనలు

  చంద్రబాబు ముందు రేవంత్ రెండు ప్రతిపాదనలు

  తెలంగాణలో టిడిపి పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఇది గమనించిన రేవంత్ రెడ్డి అధినేత చంద్రబాబు ముందు గతంలోనే రెండు ప్రతిపాదనలు పెట్టారని తెలుస్తోంది. ఆయన ప్రతిపాదనలకు చంద్రబాబు నిరాకరించారని తెలుస్తోంది. దీంతో రేవంత్ కాంగ్రెస్ వైపు అడుగులు వేశారని అంటున్నారు.

  ఇలా చేస్తే మనకే మంచిది: బాబుకు రేవంత్

  ఇలా చేస్తే మనకే మంచిది: బాబుకు రేవంత్

  ఇప్పుడు తెలంగాణ టిడిపికి కీలక నేత రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు ముందు కీలక ప్రతిపాదనలు చేశారు. అందులో ఒకటి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీతో మనం కలవకూడదు. రెండోది కాంగ్రెస్ పార్టీతో వెళ్దాం. ఈ రెండింటిపై చంద్రబాబు నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది.

  పార్టీ పరిస్థితిని వివరించిన రేవంత్ రెడ్డి

  పార్టీ పరిస్థితిని వివరించిన రేవంత్ రెడ్డి

  రేవంత్ రెడ్డి తెలంగాణ టిడిపి టైగర్ అని అభిమానులు పిలుస్తారు. అంతేకాదు, కేసీఆర్ తర్వాత ప్రజల్లో రేవంత్ రెడ్డికే ఎక్కువ ఫేమ్ ఉన్నట్లు ఓ సర్వేలో కూడా తేలింది. అలాంటి రేవంత్ రెడ్డి తెలంగాణలో పార్టీ పరిస్థితిని కొద్ది రోజుల క్రితం చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లారని అంటున్నారు. మనం ఒంటరిగా వెళ్లడం కంటే టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్‌తో వెళ్లడం మంచిదని చెప్పారని తెలుస్తోంది. కానీ చంద్రబాబు అందుకు సుముఖత వ్యక్తం చేయలేదంటున్నారు.

  రేవంత్ మాట విని ఉంటే ముసలం తప్పేదా?

  రేవంత్ మాట విని ఉంటే ముసలం తప్పేదా?

  తెలంగాణలో అధికార టిఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే టిడిపి ఒక్కదాని వల్ల కాదని, బిజెపికి సత్తా లేదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్‌తో కలిసి కెసిఆర్‌ను ఎదుర్కొందామని చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. కానీ చంద్రబాబు ముందుకు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ తన దారి తాను చూసుకున్నారని అంటున్నారు.

  విదేశాల్లో బాబు, టిటిడిపిలో రేవంత్ వర్సెస్ రమణ

  విదేశాల్లో బాబు, టిటిడిపిలో రేవంత్ వర్సెస్ రమణ

  చంద్రబాబు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ టిడిపిలో కోల్డ్ వార్ మొదలయిందని చెప్పవచ్చు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రేపు (గురువారం (టిడిఎల్పీ) భేటీ ఉంది. అయితే రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆయనను పార్టీ పదవుల నుంచి తొలగించాలని చంద్రబాబుకు టిడిపి లేఖ రాసింది. రేవంత్ ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని టిడిపి చీఫ్ ఎల్ రమణ చెప్పారు.

  ధీటుగా స్పందిస్తున్న రేవంత్ రెడ్డి

  ధీటుగా స్పందిస్తున్న రేవంత్ రెడ్డి

  తెలంగాణ టిడిపి నేతల మాటలకు రేవంత్ రెడ్డి కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. శాసన సభా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని రేవంత్ రెడ్డి పరోక్షంగా రమణను ఉద్దేశించి అన్నారు. తాను ఇవ్వాలనుకున్న వివరణ చంద్రబాబుకే ఇస్తానని చెప్పారు. చంద్రబాబు వచ్చే వరకు ఎవరితో మాట్లాడనని చెప్పారు. చంద్రబాబు తనపై ఎంతో నమ్మకం ఉంచారని, స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు.

  English summary
  It is said that Revanth Reddy wants a categorical assurance from Chandrababu Naidu that the TDP will not align with the TRS in the next general election. Revanth will also seek Chandrababu’s approval for his plans to make the TDP join hands with the Congress against the TRS government. As both the demands are likely to be rejected by Chandrababu, Revanth is fine tuning his plan to quit the TDP and join the Congress.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more