వైసీపీలోకి యనమల సోదరుడు - బంపరాఫర్..!?
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు వైసీపీలోకి ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు పార్టీలు సమాయత్తం అవుతున్న వేళ ఊహించని ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. నేతల పార్టీల జంపింగ్ లు మొదలయ్యాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు పార్టీని ధిక్కరించి..ప్రతిపక్షం వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి వైసీపీలోకి కొందరు నేతలు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ..సీట్ల ఖరారు పైన కొందరు సీనియర్లలో టెన్షన్ మొదలైంది. మరి కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకత్వం ఇంఛార్జ్ లను మారుస్తూ తీసుకున్న నిర్ణయాలతో టీడీపీ నేతలు పార్టీ మారేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు వైసీపీలోకి ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.

యనమల కుమార్తెకు ఇంఛార్జ్...సోదరుడు దూరం
కొంత కాలంగా తుని నియోజకవర్గంలో టీడీపీలో యనమల కుటుంబలో సీటు కోసం పోటీ మొదలైంది. తుని నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత యనమల స్థానంలో గత రెండు ఎన్నికల్లోనూ ఆయన సోదరుడు కృష్ణుడు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి తుని ఇంఛార్జ్ గా తన కుమార్తె కోసం యనమల ప్రయత్నాలు ప్రారంభించిన సమయం నుంచి సోదరుడు నుంచి అభ్యంతరాలు మొదలయ్యాయి. ఇదే అంశం పైన కృష్ణుడు నియోజకవర్గ పార్టీ నేతలతో జరిపిన ఫోన్ సంభాషణలు వైరల్ అయ్యాయి. తాజాగా.. తుని ఇంఛార్జ్ గా యనమల కుమార్తె దివ్యను నియమిస్తూ టీడీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో..యనమల కృష్ణుడు తన మద్దతు దారులతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తే తాజాగా పార్టీ తీసుకున్న నిర్ణయం తనకు మనస్థాపం కలిగించిందని తన అనుచరుతలో వాపోయారు.

వైసీపీలోకి కృష్ణుడు..బంపరాఫర్
తుని నుంచి ప్రస్తుత మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజా చేతిలోనే రెండు సార్లు కృష్ణుడు ఓడిపోయారు. ఇప్పుడు కృష్ణుడిని వైసీపీలోకి తీసుకొనేందుకు రంగం సిద్దమైంది. సీనియర్ నేత యనమల సోదరుడు కావటం..కీలక జిల్లా.. సామాజిక వర్గాల పరంగానూ ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో వైసీపీ ముఖ్యులు రంగంలోకి దిగారు. యనమల కృష్ణుడు వైసీపీలో చేరితే ప్రస్తుతానికి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించేందుకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల సమయంలో వీలైతే ఎమ్మెల్యే సీటు..లేకుంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామంటూ అభయం ఇచ్చారని తెలుస్తోంది. దీని పైన తన అనుచరులతో కృష్ణుడు మంతనాలు ప్రారంభించారు. కృష్ణుడు ఏ నిర్ణయం తీసుకున్నా...కలిసే అడుగులు వేస్తామని అనుయాయులు చెబుతున్నట్లుగా సమాచారం. దీంతో..మరింత ఆలస్యం చేయకుండా వైసీపీలో చేరేందుకు కృష్ణుడు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

రంగంలోకి చంద్రబాబు..నేతలకు బాధ్యతలు
యనమల కృష్ణుడు వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారనే విషయం తెలియగానే టీడీపీ అధినేత చంద్రబాబు అలర్ట్ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా నేతలతో మాట్లాడారు. కృష్ణుడుని తన దగ్గరకు తీసుకొని రావాలని మాజీ ఎమ్మెల్యేలు వర్మ..వరుపుల రాజాకు సూచించారు. ఈ నెల 16న చంద్రబాబు జిల్లా పర్యటనకు రానున్నారు. ఆ సమయంలో చంద్రబాబును కలిసి తనకు జరిగిన అన్యాయం పైన చర్చించాలని తొలుత కృష్ణుడు భావించారు. ఇప్పుడు వైసీపీ నేతలతో మంతనాలు..వారిచ్చిన ఆఫర్ తో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..టీడీపీ నేతలు కృష్ణుడు వైసీపీలోకి వెళ్లకుండా వారించేందుకు చివరి ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఇదే సమయంలో వైసీపీ నేతల హామీతో అధికార పార్టీ కండువా కప్పుకొనేందుకు కృష్ణుడు సిద్దమయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు యనమల సోదరుడి నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications