"బిజెపికీ జగన్‌కీ మధ్య వారధి ప్రశాంత్ కిశోర్": "పవన్ వద్ద జగన్ తాకట్టు"
విజయవాడ: బిజెపికి, వైఎస్సార్ కాంగ్రెసుకు మధ్య ప్రశాంత్ కిశోర్ వారధిగా మారారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బిజెపి సమావేశంలో ప్రశాంత్ కిశోర్ పాల్డొనడంతో 2019 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయనేది తేలిపోయిందని ఆయన అన్నారు.
ఆర్థిక నేరాల్లో నిండా మునిగిన వైసిపికి బిజెపి దగ్గర కావడం నీతిబాహ్యమైన చర్య అని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో అన్నారు. రాష్ట్రానికి సంబంధించి 2015-16 సంవత్సరాన్ని కేంద్రం బేస్ ఇయర్‌గా పరిగణనలోకి తీసుకుందని ఆయన చెప్పారు.

కేంద్రం ఇలా ఇవ్వాలి...
కొన్ని పద్దుల నుంచి రెవెన్యూను కలపలేదని, అందువల్ల బేస్ ఇయర్ రెవెన్యూను సవరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లేఖ రాశారని యనమల అన్నారు. 2015-16లో ఫర్నేస్ ఆయిల్ ఎల్పీజీ, కిరోసిన్‌పై చమురు ంపెనీలు వ్యాట్, జిఎస్టీ చెల్లించాయని, ఆ మొత్తం రూ. 319 కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు. అందుకు సంబంధించిన లెక్కలు చెబుత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున నెలకు రెవెన్యూ రూ.15,002 కోట్లు ఉంటుంందని, ఈ మేరకు సవరణలు చేసి పరిహారాన్ని రాష్ట్రానికి చెల్లించాలని ఆయన కోరారు.

జగన్ బిజెపితో చేతులు కలిపారు...
రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తుంటే పదవీ కాంక్షతో వైఎస్ జగన్ బిజెపితో చేతులు కలిపారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ప్రశాంతంగా అభివృద్ధి దిశలో పయనిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, చంద్రబాబు ముందు వారి ఎత్తులు సాగవని ఆయన అన్నారు.

పవన్ కల్యాణ్‌పైనా...
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. చంద్రబాబును బలహీనపరిచేందుకు జగన్ బిజెపితో చేతులు కలిపి కొత్త డ్రామాకు తెరలేపారని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. చంద్రబాబును ఎదుర్కునే ధైర్యం లేకనే ఐదు కోట్ల మంది ఆంధ్రుల హక్కులను మోడీ, పవన్ కల్యాణ్ వద్ద జగన్ తాకట్టు పెట్టారని ఆయన అన్నారు. చంద్రబాబును ఎదుర్కోలేని దద్దమ్మలు పవన్, జగన్, బిజెపి అని ఆయన అన్నారు

గురువుకే పంగనామాలు పెట్టారు...
గురువు అద్వానీకే పంగనామాలు పెట్టిన చరిత్ర నరేంద్ర మోడీదని బుద్ధా వెంకన్న అన్నారు. కాంగ్రెసు పార్టీ పాలనలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ బొత్స సత్యనారాయణ అని బుద్ధా వెంకన్న అన్నారు. ఆలాంటి బొత్సకు చంద్రబాబును, లోకేష్‌ను విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. టిటిడీ చైర్మన్ా ఉన్న కాలంలో వందల కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్న భూమన కరుణాకర్ రెడ్డి సిబిఐని ఊరకుక్కలతో పోల్చడం సరి కాదని అన్నారు.

పవన్ కల్యాణ్‌పై బుద్దా వెంకన్న ఇలా...
కేంద్రంపై అవిశ్వాసం ప్రతిపాదిస్తే మద్దతు కూడగడుతానని చెప్పన పవన్ కల్యాణ్ చంద్రబాబును విమర్శించడంలో అర్థం లేదని బుద్దా వెంకన్న అన్నారు. పవన్ కల్యాణ్‌కు సత్తా ఉటే ఎపిలో ఉన్న ఇద్దరు బిజెపి ఎంపీల మద్దతును అవిశ్వాసానికి కూడగట్టాలని ఆయన సవాల్ చేశారు. బిజెపి పతనం ప్రారంభమైందని అన్నారు.












Click it and Unblock the Notifications