ఈ ప్యాకేజీకే చాలా కష్టపడ్డాం, ఎంతిస్తే అంత: యనమల ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి: కేంద్రం నుంచి ఏపీ అభివృద్ధికి సహకరించే ప్యాకేజీని రాబట్టాలని తమ ప్రభుత్వం ఎంతో కష్టపడిందని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే సాధ్యమైనంత ఎక్కువ ప్యాకేజీని సాధించుకున్నామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం అన్నారు.
ఆయన తూర్పు గోదావరి జిల్లా తునిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్రం నుంచి ఎంత వచ్చినా తీసుకుంటామన్నారు. ఈ విషయంలో అభివృద్ధి నిరోధకులైన విపక్షాల సలహాలు తమకు అక్కర్లేదని వైసిపి, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి అన్నారు.

కేంద్రం నిధులను స్వీకరించడం మినహా ప్రస్తుతం మరో మార్గం మన ముందు లేదన్నారు. అలాగే, ఇంకా కావాల్సినవి, అలాగే మనకు రావాల్సిన వాటిని అడిగి సాధించుకుంటామని చెప్పారు. ప్రతిపక్షాల వాదనను నమ్మవద్దని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ఏపీ కష్టాల సుడిగుండం నుంచి బయటపడాల్సి ఉందని చెప్పారు. అందుకు మరింత సమయం తీసుకుంటుందన్నారు. సాయం చేస్తామని ముందుకు వచ్చే కేంద్రం నుంచి ప్యాకేజీలు వద్దని సలహాలు ఇవ్వడం దుర్మార్గమన్నారు.












Click it and Unblock the Notifications